Arvind Kejriwal : మూడు గుర్రాల రథంపై మోదీ
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్
Arvind Kejriwal : ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నిప్పులు చెరిగారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఏకి పారేశారు. మోడీ మూడు గుర్రాల రథంతో బయటకు వచ్చారని ఎద్దేవా చేశారు. శుక్రవారం కేజ్రీవాల్ అసెంబ్లీలో ప్రసంగించారు. సీబీఐ , ఐడీ, క్యాష్ తో ఆటలాడు కుంటున్నాడని ఆరోపించారు. బిజేపీయేతర ప్రభుత్వాలను, సంస్థలను , వ్యక్తులను, నేతలను టార్గెట్ చేసుకున్నాడని మండిపడ్డారు.
Arvind Kejriwal Slams PM Modi
ఈ మూడు గుర్రాలతో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గోవా, మణిపూర్ , కర్ణాటక సహా పలు రాష్ట్రాల ప్రభుత్వాలను కూల్చాడని సంచలన ఆరోపణలు చేశారు అరవింద్ కేజ్రీవాల్. ప్రస్తుతం మోదీ ప్రయోగించిన గుర్రాలు ఢిల్లీకి కూడా చేరుకున్నాయని కానీ మోదీ ఆటలు సాగవన్నారు.
ఆప్ ఎమ్మెల్యేలకు రూ. 25 కోట్లు ఆఫర్ చేశారని, కానీ ఢిల్లీ ప్రజలు ఒప్పు కోలేదన్నారు సీఎం. ఇక్కడి వారు వజ్రాలను ఎంపిక చేసి పంపారని చెప్పారు. ఒక్కరు కూడా అమ్ముడు పోలేదన్నారు అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal). మహారాష్ట్రలో బీజేపీలో చేరుతున్న వారికి బెయిల్ లభిస్తోందని కానీ మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్ ఎలాంటి నేరం చేయకుండా జైలులో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ గనుక బీజేపీలో చేరితే బెయిల్ తప్పకుండా వస్తుందన్నారు.
Also Read : K Sivan : చంద్రయాన్-3కి గ్రౌండ్ సాయం అక్కర్లేదు