Balakrishna Akkineni : అయ్యో బాబాయిని అలా అంటానా

దివంగ‌త అక్కినేనిపై అనుచిత వ్యాఖ్య‌లు చేశారంటూ పెద్ద ఎత్తున రాద్దాంతం చోటు చేసుకుంది న‌టుడు బాల‌య్య‌పై. ఆహాలో అన్ స్టాప‌బుల్ తో దుమ్ము రేపుతూ మ‌రో వైపు సినిమాల్లో వ‌రుస హిట్ల‌తో దూసుకు పోతున్నాడు నంద‌మూరి బాల‌కృష్ణ‌. అనంత‌పురం జిల్లా హిందూపురం నియోజ‌క‌వ‌ర్గానికి ఆయ‌న వ‌రుస‌గా ఎమ్మెల్యేగా గెలుపొందుతూ వ‌స్తున్నాడు.

ఇక బాల‌య్య బాబు న‌టించిన వీర సింహారెడ్డి ఊహించ‌ని దాని కంటే ఎక్కువ క‌లెక్ష‌న్లతో రాబ‌ట్టింది. ఈ సంద‌ర్భంగా విజ‌యోత్స‌వ స‌భ‌ను నిర్వ‌హించారు. అక్కినేని నాగేశ్వ‌ర్ రావుపై నోరు జారారు బాల‌కృష్ణ‌. దీనిపై అక్కినేని కుటుంబం పెద్ద ఎత్తున మండి ప‌డింది. నాగ చైత‌న్య ఏకంగా మా తాత‌య్య‌ను ఇలాగే అవమానిస్తారా అంటూ ఫైర్ అయ్యారు.