Bandi Sanjay : జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి
కరీంనగర్ ఎంపీకి పార్టీ ప్రయారిటీ
Bandi Sanjay : భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షుడు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కుమార్ కు కీలక పోస్టు దక్కింది. పార్టీ హైకమాండ్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శనివారం అధికారిక ప్రకటన చేసింది. బండి సంజయ్ కుమార్ ను జాతీయ కార్యవర్గం లోకి తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ఇందులో భాగంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి అప్పగించినట్లు వెల్లడించింది.
Bandi Sanjay Promoted
ఇదిలా ఉండగా గత కొంత కాలంగా బండి తెలంగాణ బీజేపీ చీఫ్ గా ఉన్నారు. త్వరలో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఉన్నట్టుండి బండిని మార్చింది పార్టీ హైకమాండ్. ఆయనను తప్పించి కేంద్ర కేబినెట్ లో కొలువు తీరిన గంగాపురం కిషన్ రెడ్డిని నియమించింది.
రాష్ట్రంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓట్లను చీల్చే భాగంగా ఆయనకు పదవి కట్టబెట్టినట్లు టాక్. మొత్తంగా వెనుకబడిన తరగతుల కులానికి చెందిన బండి సంజయ్(Bandi Sanjay) ను తీసేయడంతో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దీనిని దృష్టిలో పెట్టుకున్న హై కమాండ్ పార్టీకి డ్యామేజ్ కాకుండా ఉండేందుకు గాను బండి సంజయ్ కుమార్ కు కీలక పదవి అప్పగించినట్లు టాక్.
ఇదే సమయంలో పార్టీ అధ్యక్షుడితో పాటు ప్రచార కమిటీ చైర్మన్ గా ఈటల రాజేందర్ , జాతీయ కార్యవర్గ సభ్యుడిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని నియమించింది పార్టీ హైకమాండ్.
Also Read : Pawan Kalyan Gaddar : ప్రజా యుద్ద నౌక ఆరోగ్యంపై ఆరా