Rishi Sunak : దేశం కోసం రేయింబ‌వ‌ళ్లు ప‌ని చేస్తా – సున‌క్

షాకింగ్ కామెంట్స్ చేసిన పీఎం అభ్య‌ర్థి

Rishi Sunak :  బ్రిట‌న్ ప్ర‌ధాన మంత్రి ప‌ద‌వికి డెడ్ లైన్ ద‌గ్గ‌ర పడింది. సెప్టెంబ‌ర్ 5న అటో ఇటో తేల‌నుంది. ప్ర‌వాస భార‌తీయుడైన రిషి సున‌క్ పేరు యావ‌త్ ప్ర‌పంచ‌మంతా వినిపిస్తోంది.

ఇప్ప‌టి వ‌ర‌కు నాలుగు రౌండ్ల ఎన్నిక‌లు జ‌రిగాయి. వాటిలో సున‌క్ టాప్ లో నిలిచారు. కానీ అనూహ్యంగా ఒపినీయ‌న్ పోల్స్ లో పూర్తిగా వెనుక‌బ‌డ్డారు.

విదేశాంగ శాఖ మంత్రి లిజ్ ట్ర‌స్ ముందంజ‌లో కొన‌సాగుతున్నారు. రిషి సున‌క్(Rishi Sunak) ప్ర‌ముఖ ఐటీ దిగ్గ‌జ సంస్థ ఇన్ఫోసిస్ కంపెనీ చైర్మ‌న్ నారాయ‌ణ మూర్తి అల్లుడు. ఆయ‌న కూతురుని చేసుకున్నారు.

ఈ సంద‌ర్భంగా రిషి సున‌క్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. త‌న‌ను గెలిపిస్తే ప్ర‌పంచంలోనే బ్రిట‌న్ ను అత్యుత్త‌మ దేశంగా తీర్చి దిద్దుతాన‌ని చెప్పారు.

ఇందు కోసం తాను శాయ‌శ‌క్తులా కృషి చేస్తాన‌ని అన్నారు. ఇంకా కొన్ని రోజుల స‌మ‌యం మాత్ర‌మే ఉండ‌డంతో ఎవ‌రు గెలుస్తార‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది.

దేశం కోసం రాత్రి పగ‌లు అనే తేడా లేకుండా ప‌ని చేస్తాన‌ని స్ప‌ష్టం చేశారు రిషి సున‌క్(Rishi Sunak). ప్ర‌జ‌ల సాక్షిగా ప్ర‌తిజ్ఞ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

క‌న్జ‌ర్వేటివ్ పార్టీ నాయ‌కుడిగా బోరిస్ జాన్స‌న్ నుండి బాధ్య‌త‌లు స్వీక‌రించేందుకు గాను కీల‌క‌మైన పోటీ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. ప్ర‌స్తుతం లిజ్ ట్ర‌స్ , రిష్ సున‌క్ మ‌ధ్యే బిగ్ ఫైట్ కొన‌సాగ‌నుంది.

బ్రిటిష్ భార‌తీయుడిగా రిషి సున‌క్ త‌న విజ‌న్ ను ప్ర‌క‌టించాడు. 42 ఏళ్ల మాజీ ఆర్థిక మంత్రి ద్ర‌వ్యోల్బ‌ణంపై ప‌ట్టు సాధించేందుకు త‌న ప్ర‌చారాన్ని మ‌రింత ముమ్మ‌రం చేశారు. ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని గ‌ట్టెక్కించే బాధ్య‌త తాను తీసుకుంటాన‌ని చెప్పారు.

Also Read : అరుదైన నాయ‌కుడు గోర్బ‌చెవ్ – బైడెన్

Leave A Reply

Your Email Id will not be published!