Caller Name Display : కాలర్ పేరు తప్పనిసరి కాదు
ట్రూ కాలర్ అనేది తప్పనిసరి కాదని స్పష్టం చేశాయి టెలికాం సంస్థలు. ఈ మేరకు ఇదే విషయాన్ని టెలికాం రెగ్యులేటరీ కమిషన్ (ట్రాయ్) కు వెల్లడించాయి. కాలింగ్ నేమ్ ప్రెజెంటేషన్ (సీఎన్పీ) అనేది ఒక సప్లిమెంటరీ సర్వీస్ . ఇది ఎవరైనా కాల్ చేసినప్పుడు ఫోన్ స్క్రీన్ లపై ఎవరు కాల్ చేస్తున్నారనే విషయం తెలుస్తుంది.
టెలికాం సర్వీస్ ప్రొవైడర్లకు కాలర్ నేమ్ డిస్ ప్లే ఐచ్ఛికంగా ఉండాలని సీఓఏఐ స్పష్టం చేసింది. కాలింగ్ నేమ్ ప్రెజెంటేషన్ (సీఎన్ఏపీ)ని అమలు చేయడం తప్పనిసరి చేయకూడదని, టెలికాం ఆపరేటర్లకు ఐచ్చికంగా ఉంచాలని ఇండస్ట్రీ బాడీ వాదించింది. ఎందుకంటే అసోసియేషన్ తన పాయింట్ ను వాదించేందుకు సాంకేతిక , గోప్యత, వ్యయ సంబంధిత ఆందోళనలను రెగ్యులేటర్ కమిషన్ ట్రాయితో పంచుకుంది.
టెలికమ్యూనికేషన్ నెట్ వర్క్ లలో కాలింగ్ నేమ్ ప్రెజెంటేషన్ (సీఎన్ఏపీ) సప్లిమెంటరీ సర్వీస్ ను ప్రవేశ పెట్టాల్సిన అవసరంపై టెలికాంగ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రారంభించిన సంప్రదింపు ప్రక్రియలో భాగంగా సమర్పణలు ఉన్నాయి. సీఎన్ఏపీ అనేది ఒక అనుబంధ సేవ. ఇది ఎవరైనా కాల్ చేసినప్పుడు ఫోన్ స్క్రీన్ లపై కాలర్ పేరు ఫ్లాష్ అయ్యేలా చేస్తుంది.
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed