Chandrababu Naidu : ఆగస్టు 1 నుంచి బాబు ప్రాజెక్టుల బాట
పరిశీలించనున్న టీడీపీ చీఫ్
Chandrababu Naidu : ఏపీలో పాలన పడకేసిందని , జగన్ అసమర్థత కారణంగా ప్రాజెక్టులు నత్త నడకన నడుస్తున్నాయని టీడీపీ చీఫ్ ,మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఇందులో భాగంగా ఆగస్టు 1 నుంచి తాను ఏపీలోని ప్రాజెక్టులను సందర్శిస్తారని టీడీపీ వెల్లడించింది. . 1న బసకచర్ల హెడ్ రెగ్యులేటర్ ను సందర్శించనున్నారు. అనంతరం నందికోట్కూర్ లో బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం మచ్చుమర్రి ఎత్తిపోతల పథకం సందర్శిస్తారు చంద్రబాబు. అక్కడి నుంచి ఆలూరుకు వెళతారు. రాత్రి అక్కడే బస చేస్తారు.
Chandrababu Naidu Said
ఆగస్టు 2న మాల్యాల ఎత్తి పోతల పథకాన్ని సందర్శిస్తారు చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu). అలగనూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ , నందికోట్కూర్ లోని గోదరకల్లు రిజర్వాయర్ ను సందర్శిస్తారు. అనంతరం పాణ్యం, బనగానపల్లె, కోవెలకుంట్లలో పర్యటిస్తారు చంద్రబాబు. అక్కడి నుంచి జమ్మలమడుగుకు వస్తారు. అక్కడ రాత్రి బస చేస్తారు.
ఆగస్టు 3న గండికోట రిజర్వాయర్ ను సందర్శిస్తారు టీడీపీ చీఫ్. అక్కడి నుంచి పైడిపాలెం రిజర్వాయర్ ను పరిశీలిస్తారు. అనంతపురంలో చంద్రబాబు నాయుడు రాత్రి బస చేస్తారు. ఆగస్టు 4న ఒంటిమెట్ట వద్ద నిలిచి పోయిన జీడిపల్లి – బీటీపీ కాలువ పనులను చూస్తారు. ఆత్మకూరు సమీపంలో ఆగి పోయిన జీడిపల్లి – పేరూరు కాలువ పనులను పరిశీలిస్తారు టీడీపీ చీఫ్.
Also Read : Telangana High Court : తెలంగాణ సర్కార్ పై హైకోర్టు గుస్సా