CM Revanth Reddy : మోదీతో భేటీ కానున్న రేవంత్
సీఎంతో పాటు డిప్యూటీ సీఎం
CM Revanth Reddy : హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్రంలో నూతన ముఖ్యమంత్రిగా కొలువు తీరిన ఎనుముల రేవంత్ రెడ్డి తొలిసారిగా దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో బేటీ కానున్నారు. ఈ మేరకు తన టూర్ ను ఖరారు చేసుకున్నారు. ఈ మేరకు ఢిల్లీకి పయనమయ్యారు. రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా హిస్తనకు వెళ్లనున్నారు.
CM Revanth Reddy May be Met PM Modi
డిసెంబర్ 26న ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ అపామెంట్ మెంట్ ఇచ్చారు. దీంతో సంతోషానికి లోనయ్యారు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు ప్రధానితో భేటీ కానున్నారు ఈ ఇద్దరు.
ఈ సందర్బంగా రాష్ట్రానికి సంబంధించి చోటు చేసుకున్న ఆర్థిక పరిస్థితులు, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల విడుదల గురించి ప్రధానమంత్రితో విన్నవించనున్నారు. మోదీతో భేటీ అనంతరం ఏఐసీసీ పార్టీ పెద్దలను కూడా కలవనున్నారు రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క.
ఇదే సమయంలో త్వరలో సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి. అంతే కాకుండా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ సంస్థల చైర్మన్లు, డైరెక్టర్ల పోస్టుల భర్తీకి సంబంధించి ఎవరెవరిని ఎంపిక చేయాలనే దానిపై చర్చించనున్నారు. మొత్తంగా రేపటి ఢిల్లీ టూర్ పై కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.
Also Read : MLC Kavitha : రాహుల్ పై కవిత కామెంట్స్