CSK IPL 2023 Auction : మినీ వేలం పాట‌లో ‘డైన‌మిక్’ మార్క్

ఐపీఎల్ లో టాప్ ఫెవ‌రేట్ టీమ్ ఏదైనా ఉందంటే అది ఝార్ఖండ్ డైన‌మెట్ మ‌హేంద్ర సింగ్ ధోనీ సార‌థ్యంలోని చెన్నై సూప‌ర్ కింగ్స్. కొచ్చిలో జ‌రిగిన ఐపీఎల్ 2023 మినీ వేలం పాట‌లో సీనియ‌ర్ల‌తో పాటు జూనియ‌ర్ ఆట‌గాళ్ల‌ను ఎంపిక చేసుకుంది. ఈ మొత్తం ఎంపిక‌లో ధోనీ మార్క్ క‌నిపించింది. ఆ జ‌ట్టు యాజ‌మాన్యం పూర్తిగా కెప్టెన్ పైనే న‌మ్ముకుంది.

ఈసారి ఐపీఎల్ లో అనూహ్య ప‌రిణామం చోటు చేసుకుంది. తాను జ‌ట్టు నాయ‌క‌త్వం నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించాడు ధోనీ. ర‌వీంద్ర జ‌డేజాకు అప్ప‌గించింది మేనేజ్ మెంట్. జ‌ట్టు ఆశించిన మేర రాణించ లేదు. దీంతో తిరిగి జార్ఖండ్ డైన‌మెట్ కే ఛాన్స్ ఇచ్చింది.