Double Decker Bus : డబుల్ డెక్కర్ బస్సు హల్ చల్
తిరుమలలో భక్తులకు అందుబాటులోకి
Double Decker Bus : తిరుమల – పుణ్య క్షేత్రం తిరుమలకు భక్తుల రద్దీ కొనసాగుతోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) విస్తృతంగా ఏర్పాట్లు చేస్తోంది. ప్రత్యేకించి ఉచితంగా భక్తులను తిరుమలలో ఉచితంగా స్వామి వారి బస్సుల ద్వారా చేరవేస్తోంది.
Double Decker Bus in Tirumala
తాజాగా తిరుమలలో ప్రయోగాత్మకంగా రోడ్లపై విద్యుత్ డబుల్ డెక్కర్ బస్సులను టీటీడీ(TTD) ప్రారంభించింది. దక్షిణ భారత దేశంలో ఈ బస్సులను ప్రారంభించడం హైదరాబాద్ తర్వాత తిరుమల పుణ్యక్షేత్రమని పేర్కొన్నారు టీటీడీ చైర్మన్ భూమున కరుణాకర్ రెడ్డి.
ఇదిలా ఉండగా భవిష్యత్తులో మరిన్ని డబుల్ డెక్కర్ బస్సులను తీసుకు రావడాన్ని పరిశీలిస్తామని స్పష్టం చేశారు. బస్సులకు అనుగుణంగా తిరుమల రోడ్లను మరింత ఆధునికంగా, విస్తరించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా 18 మాస్టర్ రోడ్లు, ఫ్రీ లెఫ్ట్ రోడ్లను పెద్ద ఎత్తున నిర్మించడం జరిగిందన్నారు భూమన కరుణాకర్ రెడ్డి.
తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్న భూమన టీటీడీకి చైర్మన్ గా రెండోసారి కొలువు తీరారు. ఏపీ సీఎం జగన్ రెడ్డి ఏరికోరి పదవి అప్పగించాడు.
Also Read : MLC Kavitha : ఈడీ నోటీసు కాదది మోడీ నోటీసు