AICC Chief : అక్టోబర్ 17న కాంగ్రెస్ చీఫ్ ఎన్నిక
అక్టోబర్ 19న అధ్యక్షుడి ఫలితం
AICC Chief : సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్నడూ లేనంతగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. సీనియర్ నాయకులు ఒక్కరొక్కరే వీడుతున్నారు.
ఆపై రాహుల్ గాంధీని వారంతా టార్గెట్ చేశారు. జీ23 పేరుతో అసమ్మతి స్వరం వినిపించారు. తాజాగా కురు వృద్దుడు, ట్రబుల్ షూటర్ గా పేరొందిన మాజీ కేంద్రమంత్రి, మాజీ సీఎం గులాం నబీ ఆజాద్ గుడ్ బై చెప్పారు.
ఆయనతో పాటు పలువురు నేతలు క్యూ కడుతున్నారు. ఈ విపత్కర తరుణంలో కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఎన్నిక పై నేడో రేపో అంటూ వాయిదా వేస్తూ వచ్చారు. ఆదివారం సీడబ్ల్యూసీ కీలక భేటీ అయ్యారు.
ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ 17న ఏఐసీసీ చీఫ్(AICC Chief) ఎన్నిక జరిపేందుకు నిర్ణయించారు. అక్టోబర్ 19న ఇందుకు సంబంధించి 19న కౌంటింగ్ నిర్వహించనున్నారు.
కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ , ప్రియాంక గాంధీ వాద్రాతో పాటు రాహుల్ గాంధీ సీడబ్ల్యూసీ సమావేశంలో ఉన్నారు. పార్టీ చీఫ్ గా ఎవరు ఉంటారనే దానిపై ప్రచారం జరుగుతోంది.
పార్టీని ఎవరు నడిపిస్తారనే దానిపై ఉత్కంఠ కంటిన్యూ అవుతోంది. గాంధీ ఫ్యామిలీ మాత్రం తమకు పార్టీ పదవులు వద్దంటూ ఇప్పటికే ప్రకటించారు.
కానీ సీనియర్లు ప్రధానంగా జైరాం రమేష్, మల్లికార్జున ఖర్గే, తదితర నేతలంతా రాహుల్ గాంధీ చీఫ్ గా ఉండాలని కోరుతున్నారు. మరో వైపు గాంధీ యేతర వ్యక్తులకే పార్టీ అధ్యక్ష పదవి కట్టబెట్టాలనే డిమాండ్ పెరుగుతోంది.
Also Read : సోనాలీ ఫోగత్ కేసు సీబీఐకి ఓకే – సీఎం