Elon Musk Auctions : నాకో తిక్కుంది దానికో లెక్కుంది

ద‌ర్శ‌కుడు హ‌రీశ్ శంక‌ర్ ఏ ముహూర్తాన డైలాగ్ రాశాడో కానీ స‌రిగ్గా ప‌వ‌న్ క‌ళ్యాణ్ కంటే టెస్లా సిఇఓ, చైర్మ‌న్ , ట్విట్ట‌ర్ బాస్ ఎలోన్ మ‌స్క్ కు క‌రెక్టుగా స‌రిపోతుంది. రూ. 4,400 కోట్లు పెట్టి మైక్రో బ్లాగింగ్ సంస్థ ట్విట్టర్ ను కొనుగోలు చేశాడు. ఆ వెంట‌నే టాప్ ఎగ్జిక్యూటివ్స్ ను సాగ‌నంపాడు.

కాస్ట్ క‌టింగ్ పేరుతో ప‌ని చేస్తున్న ఉద్యోగుల‌ను మెల మెల్ల‌గా ఇంటికి పంపిస్తున్నాడు. మ‌రో వైపు కాలిఫోర్నియాలో ట్విట్ట‌ర్ ఆఫీసు అద్దె చెల్లించ‌క పోవ‌డంతో య‌జ‌మాని కోర్టును ఆశ్ర‌యించాడు. త‌న‌కు అద్దె చెల్లించ‌కుండా ఇబ్బంది పెడుతున్నాడంటూ ఆరోపించాడు. దీనిపై కోర్టులో కేసు న‌డుస్తోంది.

ఇక రోజు రోజుకు విచిత్రంగా ప్ర‌వ‌ర్తిస్తూ దిగ్గ‌జాల‌కు కూడా అర్థం కాని రీతిలో సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంటున్నాడు. చాలా మంది ఎలోన్ మ‌స్క్ నిర్వాకం దెబ్బ‌కు ఈ తిక్కోడిని భ‌రించ లేమంటూ చాలా మంది ఉద్యోగులు గుడ్ బై చెబున్నారు. మ‌రో వైపు టాయిలెట్స్ కు వెళ్లేందుకు వాడే పేప‌ర్స్ కూడా మీరే తెచ్చు కోవాలంటూ స్ప‌ష్టం చేయ‌డంతో దెబ్బ‌కు జాబ‌ర్స్ ల‌బోదిబోమంటున్నారు.