FIFA World Rankings 2022 : ప్ర‌పంచ ర్యాంకింగ్స్ లో మెస్సీ సేన

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ ముగిసింది. వ‌ర‌ల్డ్ వైడ్ ర్యాంకింగ్స్ విడుద‌ల‌య్యాయి. వ‌ర‌ల్డ్ లో మోస్ట్ పాపుల‌ర్ ఫుట్ బాల‌ర్ గా పేరొందిన అర్జెంటీనా స్కిప్ప‌ర్ లియోనెల్ మెస్సీ సార‌థ్యంలో ఆ జ‌ట్టు మెస్మరైజ్ చేసింది. ఖ‌తార్ వేదిక‌గా జ‌రిగిన ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ ను ఎగరేసుకు పోయింది. ఫైన‌ల్ లో పెనాల్టీ షూటౌట్ లో 4 – 2 తేడాతో మెబాప్పే నేతృత్వంలోని ఫ్రాన్స్ జ‌ట్టును మ‌ట్టి క‌రిపించింది.

ఇందుకు గాను మెస్సీ సేన‌కు ఏకంగా రూ. 347 కోట్ల ప్రైజ్ మ‌నీ ల‌భించింది. ప్ర‌పంచ వ్యాప్తంగా అత్య‌ధికంగా మెస్సీ కోసం గూగుల్ ను సెర్చ్ చేశారంటూ టెక్ దిగ్గ‌జ కంపెనీ గూగుల్ సిఇఓ సుంద‌ర్ పిచాయ్ వెల్ల‌డించాడు. ఇదిలా ఉండ‌గా ఈ అద్భుత విజ‌యం ద‌క్క‌డంతో తాజాగా ప్ర‌క‌టించిన ఫిఫా వ‌ర‌ల్డ్ ర్యాంకింగ్స్ లో ఏకంగా రెండో స్థానానికి చేరుకుంది అర్జెంటీనా.

కాగా ప్ర‌పంచ క‌ప్ ను చేజిక్కించుకున్నా నెంబ‌ర్ వ‌న్ ద‌క్కించుకోలేక పోయింది. ఇది అంద‌రినీ ప్ర‌త్యేకించి ఫుట్ బాల్ ప్రేమికుల‌ను విస్తు పోయేలా చేసింది. తాజాగా ప్ర‌క‌టించిన ర్యాంకింగ్స్ లో బ్రెజిల్ టాప్ లో నిలిచింది. ఆ జ‌ట్టుకు 1840 పాయింట్లు ద‌క్కాయి. నెంబ‌ర్ వ‌న్ గా నిలిచింది.