G Kishan Reddy : కాంగ్రెస్..బీఆర్ఎస్ ఒక్కటే
బీజేపీ చీఫ్ జి. కిషన్ రెడ్డి ఫైర్
G Kishan Reddy : బీజేపీ చీఫ్ , కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ సర్కార్ నిద్ర పోతోందని మండిపడ్డారు. ఈ 9 ఏళ్ల కాలంలో సీఎం కేసీఆర్ ఏం చేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. పేదలకు ఇళ్లు కట్టేందుకు స్థలాలు లేవని , కానీ కోట్ల రూపాయల ప్రజా ధనంతో నిజాం లాంటి రాజ భవనం ప్రగతి భవన్ కట్టుకున్నాడంటూ ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండూ ఒక్కటేనని మండిపడ్డారు.
G Kishan Reddy Words
కాంగ్రెస్ భవన్ కు 10 ఎకరాలు, బీఆర్ఎస్ భవన్ కు 11 ఎకరాలు సీఎం కేసీఆర్ ఇచ్చాడని సంచలన ఆరోపణలు చేశారు జి. కిషన్ రెడ్డి. ఆ రెండు పార్టీలు పైకి ఆరోపణలు చేసుకుంటున్నాయని, ఆ తర్వాత లోపట కలిసే ఉంటున్నాయని ఆరోపించారు.
రాష్ట్రంలో వ్యవస్థలన్నింటిని నాశనం చేశాడని, ఇప్పుడు అప్పుల కుప్పగా మార్చిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా వైఫల్యం చెందారంటూ ఆరోపించారు. రాష్ట్రంలో 2 లక్షలకు పైగా జాబ్స్ ఖాళీగా ఉంటే ఒక్క పోస్టు కూడా భర్తీ చేసిన పాపాన పోలేదన్నారు జి. కిషన్ రెడ్డి(G Kishan Reddy). రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ సర్కార్ పై యుద్దం చేస్తామని ప్రకటించారు. తాము ప్రజా సమస్యలపై నిలదీస్తూనే ఉంటామన్నారు బీజేపీ చీఫ్.
Also Read : BRO Movie : పవన్ ‘బ్రో’ కలెక్షన్ల మోత రూ.108 కోట్లు