Hemamalini Mahua Moitra : మ‌హూవాపై హేమమాలిని ఫైర్

పార్ల‌మెంట్ లో రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగానికి ధ‌న్యవాదం తెలిపే తీర్మానం సంద‌ర్భంగా టీఎంసీ ఎంపీ మ‌హూవా మోయిత్రా చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. ఇప్ప‌టికే అదానీ గ్రూప్ కు సంబంధించిన వ్య‌వ‌హారం క‌ల‌క‌లం రేపుతోంది. ప‌లుమార్లు ఉభ‌య స‌భ‌లు వాయిదా ప‌డ్డాయి. ఒక‌రిపై మ‌రొక‌రు ఆరోప‌ణ‌లు చేసుకుంటూ ముగించారు. ఈ స‌మ‌యంలో ఎంపీ మ‌హూవా షాకింగ్ కామెంట్స్ చేయ‌డం అంద‌రినీ విస్తు పోయేలా చేసింది.

అయితే తాను అన్న దాంట్లో ఎలాంటి త‌ప్పు లేద‌న్నారు మ‌హూవా మోయిత్రా. దీనిపై సీరియ‌స్ గా స్పందించింది న‌టి హేమ‌మాలిని. ఆమె త‌న నోటిని అదుపులో పెట్టుకుంటే మంచిద‌ని సూచించారు. స‌మాచారం తెలుసు కోకుండా వ్య‌క్తిగ‌త ఆరోప‌ణ‌లు చేయ‌డం వ‌ల్ల పాపుల‌ర్ కాగ‌ల‌రేమో కానీ ప్ర‌జ‌ల్లో చుల‌క‌నై పోతామ‌ని స్ప‌ష్టం చేశారు హేమమాలిని.