Bhim Army Chief : పవర్ లోకి వస్తే గిరిజనుడే సీఎం – ఆజాద్
తాము అధికారంలోకి వస్తే మధ్యప్రదేశ్ రాష్ట్రానికి గిరిజనుడే ముఖ్యమంత్రి అవుతాడని సంచలన ప్రకటన చేశారు భీమ్ ఆర్మీ పార్టీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్. ప్రజల మద్దతును కూడగట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా న్యాయ యాత్రలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది చివరలో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. భోపాల్ లో దళిత, గిరిజన , ఓబీసీ సంఘాల మెగా ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా జరిగిన భారీ బహిరంగ సభలో భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ ప్రసంగించారు.
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed