IND vs AUS Win 2nd Test : రెండో టెస్టులో భారత్ గ్రాండ్ విక్టరీ
ఢిల్లీ వేదికగా ఆస్ట్రేలియాలో జరిగిన 2వ టెస్టు మ్యాచ్ లో భారత జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. నాలుగు టెస్టు మ్యాచ్ ల సీరీస్ లో భాగంగా ఇప్పటికే నాగ్ పూర్ లో జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో గ్రాండ్ విక్టరీ నమోదు చేసిన టీమిండియా బలమైన ఆసిస్ ను రెండో టెస్టులోనూ మట్టి కరిపించింది. ప్రధానంగా భారత జట్టు స్పిన్నర్ల ధాటికి ఆసిస్ బ్యాటర్లు విల విల లాడి పోయారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే 115 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్ కేవలం 4 వికెట్లు కోల్పోయి 118 రన్స్ చేసింది. దీంతో 2-0 తేడాతో లీడ్ లో కొనసాగుతోంది టీమిండియా.
తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 263 పరుగులు చేస్తే రెండో ఇన్నింగ్స్ లో 113 పరుగులకే చాప చుట్టేసింది. అనంతరం భారత జట్టు మొదటి ఇన్నింగ్స్ లో 262 రన్స్ చేస్తే రెండో ఇన్నింగ్స్ లో 4 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది. లక్ష్యం చిన్నదే అయినప్పటికీ భారత్ తీవ్రంగా శ్రమించింది. కీలకమైన వికెట్లను చేజార్చుకుంది. కేఎల్ రాహుల్ మరోసారి నిరాశ పరిచాడు. కెప్టెన్ రోహిత్ శర్మ , విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ లు సైతం తక్కువ స్కోర్ కే పరిమితయ్యారు.
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed