India Alliance : ఫలితాలపై ఇండియా పోస్టుమార్టం
రాబోయే ఎన్నికలపై ఫోకస్ పెట్టాలి
India Alliance : న్యూఢిల్లీ – దేశంలో తాజాగా అయిదు రాష్ట్రాలలో ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు వచ్చాయి. ప్రధాన ప్రతిపక్షాలన్నీ కలిపి ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి. త్వరలోనే వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఈసారి ఎలాగైనా మోదీ నేతృత్వంలోని బీజేపీ కూటమిని ఓడించాలని, సాధ్యమైనంత మేరకు మరికొన్ని సీట్లను పెంచు కోవాలని ప్రయత్నం చేస్తున్నాయి ప్రధాన పార్టీలు.
India Alliance Discussion
అయితే ఇండియా కూటమి లోని పార్టీలకు కోలుకోలేని షాక్ తగిలాయి ఈ ఫలితాలు. మిజోరం , ఛత్తీస్ గఢ్ , రాజస్థాన్, మధ్య ప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాలలో ఎన్నికలు పూర్తయ్యాయి. రాజస్థాన్ , ఛత్తీస్ గఢ్ లో అధికారాన్ని కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ. ఇక మధ్య ప్రదేశ్ లో తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంది బీజేపీ. అయితే అనూహ్యంగా రెండు రాష్ట్రాలలో జయ కేతనం ఎగుర వేసింది.
విచిత్రం ఏమిటంటే తెలంగాణలో అనూహ్యంగా కాంగ్రెస్(Congress) రేవంత్ రెడ్డి సారథ్యంలో పవర్ లోకి వచ్చింది. ఇక మిజోరంలో ప్రతిపక్ష కూటమి పవర్ లోకి వచ్చింది. ఈ మొత్తం ఫలితాలపై ఇవాళ ప్రధాన పార్టీలతో కూడిన ఇండియా కూటమి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే నివాసంలో సమావేశం అయ్యారు. ఈ మేరకు పోస్టుమార్టం నిర్వహించారు. ఎక్కడ పొరపాటు జరిగిందనే దానిపై విస్తృతంగా చర్చించారు.
Also Read : Revanth Reddy Thackray : ఠాక్రేతో రేవంత్ ముచ్చట