IPL 2023 Auction Record : ఐపీఎల్ మినీ వేలం భారీ మూల్యం
ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ప్రిమీయర్ లీగ్ వేలం కేరళ లోని కొచ్చిలో ముగిసింది. కానీ ఎవరూ ఊహించని రీతిలో ఉత్కంఠ భరితంగా సాగింది. మొత్తం 10 ఫ్రాంచైజీలు పాల్గొన్నాయి. ఆయా జట్ల యాజమాన్యాలు, హెడ్ కోచ్ లు, కెప్టెన్లు ఎక్కువగా తమ జట్లకు సరిపోయే ఆటగాళ్లను ఎంపిక చేసుకోవడంలో కీలకంగా వ్యవహరించారు. ఐపీఎల్ చరిత్ర లోనే అత్యధిక ధరకు అమ్ముడు పోయాడు సామ్ కరన్. ఒక రకంగా ఇది రికార్డు.
ఆ తర్వాతి స్థానం కామెరూన్ కు దక్కింది. ఈ ఆసిస్ స్టార్ ను ముంబై ఇండియన్స్ స్వంతం చేసుకుంది. 87 స్లాట్స్ కోసం ఆయా జట్లు ఫోకస్ పెట్టాయి. గతంలో స్టార్ డమ్ సాధించిన ప్లేయర్లు ఈసారి జరిగిన మినీ వేలంలో ఆకట్టుకోలేక పోవడం విస్తు పోయేలా చేసింది. చాలా మంది స్టార్లను పట్టించుకోలేదు ఫ్రాంచైజీలు.
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed