Kavya Maran Viral : కావ్య మార‌న్ సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్

మీడియా మొఘ‌ల్ గా పేరొందిన ద‌యానిధి మార‌న్ ముద్దుల కూతురు కావ్య మార‌న్ మ‌రోసారి సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా మార‌నున్నారు. వ‌చ్చే ఏడాది 2023లో జ‌ర‌గ‌నున్న మెగా ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (ఐపీఎల్) వేలం పాట‌కు స‌మ‌యం వ‌చ్చేసింది. ఇంకొద్ది గంటల్లో మినీ వేలం పాట (ఆక్ష‌న్) జ‌ర‌గ‌నుంది.

గ‌త ఏడాది ఐపీఎల్ వేలం పాట బెంగళూరులో నిర్వ‌హించింది బీసీసీఐ. ఈసారి ప్లేస్ మార్చింది. కేర‌ళ‌లోని కొచ్చి న‌గ‌రాన్ని ఎంపిక చేసింది. డిసెంబ‌ర్ 23 శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల‌కు వేలం పాట ప్రారంభం అవుతుంది. 925 మంది ఆట‌గాళ్లు ద‌ర‌ఖాస్తు చేసుకుంటే ఐపీఎల్ లో ఆడేందుకు కేవ‌లం 405 ప్లేయ‌ర్ల‌కే ఛాన్స్ ఇచ్చింది ఐపీఎల్ ప్యాన‌ల్.