Kishan Reddy : బీజేపీ నేతల కాళేశ్వరం సందర్శన
కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో నేతలు
Kishan Reddy : మేడిగడ్డ – జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజ్ ను శనివారం బీజేపీ ఆధ్వర్యంలో నేతలు సందర్శించారు. కేంద్ర మంత్రి , బీజేపీ స్టేట్ చీఫ్ జి. కిషన్ రెడ్డి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ , ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ , ఎమ్మెల్యే రఘునందన్ రావు ఉన్నారు. ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా మేడిగడ్డ బ్యారేజ్ ను దగ్గరుండి పరిశీలించారు.
Kishan Reddy Visited Kaleshwaram
ఇదిలా ఉండగా లక్షా 20 కోట్ల రూపాయల ప్రజా ధనంతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని ఆరోపించారు ఈ సందర్బంగా బీజేపీ చీఫ్ జి. కిషన్ రెడ్డి(Kishan Reddy). వేల కోట్లను నీళ్లపాలు చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రాజెక్టు ప్రమాదంలో పడిందని, దీనిని కాపాడు కోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు . కేంద్ర జలశక్తి ఆధ్వర్యంలోని సేఫ్టీ డ్యామ్ అథారిటీ పూర్తి నివేదిక సమర్పించింది. ఇందులో సంచలన విషయాలు వెలుగు చూశాయి.
డిజైన్ లో లోపం ఉందని, నిర్మాణంలో నాణ్యత లేదంటూ పేర్కొంది. ఈ తరుణంలో కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు జి. కిషన్ రెడ్డి. సరైన మెటీరియల్ ను వాడక పోవడం వల్లనే ఇలా జరిగిందంటూ మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్.
Also Read : CM KCR : స్వామీ కరుణించు నన్ను గెలిపించు