KTR : లోక్ స‌భ ఎన్నిక‌ల్లో గులాబీ జెండా ఎగ‌రాలి

పిలుపునిచ్చిన బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్

KTR : హైద‌రాబాద్ – త్వ‌ర‌లో రాష్ట్రంలో పార్ల‌మెంట్ ఎన్నిక‌లు రాబోతున్నాయి. మొత్తం 17 సీట్ల‌కు గాను అన్ని సీట్ల‌ను క్లీన్ స్వీప్ చేయాల‌ని స్ప‌ష్టం చేశారు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ మంత్రి కేటీఆర్. సోమ‌వారం చేవెళ్ల పార్ల‌మెంట్ నియోక‌వ‌ర్గంపై స‌మీక్ష చేప‌ట్టారు. ఈ సంద‌ర్బంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఎంపీ రంజిత్ రెడ్డితో పాటు మాజీ మంత్రి మ‌హేంద‌ర్ రెడ్డి పాల్గొన్నారు.

KTR Comment

ఎలాగైనా స‌రే ఈసారి మ‌రోసారి స‌త్తా చాటాల‌ని, గులాబీ జెండా ఎగుర వేయాల‌ని పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించి మాజీ సీఎం , పార్టీ బాస్ కేసీఆర్ తో పాటు తాను కూడా హాజ‌ర‌వుతామ‌ని, విస్తృతంగా ప్ర‌చారం చేస్తామ‌ని ప్ర‌క‌టించారు.

పార్టీ ప‌రంగా కావాల్సిన స‌హాయం చేస్తామ‌న్నారు. కానీ ఏ ఒక్క ఓటు కాంగ్రెస్, బీజేపీ పార్టీల‌కు పోకుండా చూడాలని, ఈ కీల‌క‌మైన బాధ్య‌త మీపై ఉంద‌ని స్ప‌ష్టం చేశారు కేటీఆర్(KTR). రంగారెడ్డి, వికారాబాద్ జిల్లా ప్ర‌జా ప్ర‌తినిధుల‌కు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ దిశా నిర్దేశం చేశారు.

గెలుపే ల‌క్ష్యంగా ప‌ని చేయాల‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టారు. ఇదిలా ఉండ‌గా తాజాగా జ‌రిగిన శాస‌న స‌భ ఎన్నిక‌ల్లో చేవెళ్ల పార్ల‌మెంట్ ప‌రిధిలోని అన్ని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు బీఆర్ఎస్ పార్టీకి 98,000 ఓట్ల లీడ్ వ‌చ్చింద‌ని గుర్తు చేశారు.

Also Read : CM Revanth Reddy : మోదీతో భేటీ కానున్న రేవంత్

Leave A Reply

Your Email Id will not be published!