LPG Cylinder Prices : సామాన్యుల‌కు షాక్ గ్యాస్ ధ‌ర‌లు ఝ‌ల‌క్

గ్యాస్ కంపెనీలు ఉన్న‌ట్టుండి బిగ్ షాక్ ఇచ్చాయి. అటు క‌మ‌ర్షియ‌ల్ ఇటు డొమెస్టిక్ గ్యాస్ వినియోగ‌దారుల‌కు చుక్క‌లు చూపించాయి. భారీగా పెంచ‌డంపై భ‌గ్గుమంటున్నారు వినియోగ‌దారులు. వామ్మో మార్చి నెల అంటేనే జ‌డుసుకునే ప‌రిస్థితి నెల‌కొంది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు త‌మ ఇష్టానుసారం పెంచుకుంటూ పోతున్నాయి.

కేంద్రంలో కొలువు తీరిన మోదీ ప్ర‌భుత్వం వాటిపై నియంత్ర‌ణ కోల్పోయింది. ప‌దే ప‌దే పెంచుకుంటూ పోతున్నా అడిగే ప‌రిస్థితి లేకుండా పోయింది. ఒక ర‌కంగా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారి పోయింది ప్ర‌స్తుత ప్ర‌భుత్వం.