PM Modi : పోష‌కాహార లోపంపై యుద్దం చేయాలి – మోదీ

ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాలని పిలుపు

PM Modi : పోష‌కాహారం లోపం దేశాన్ని ప‌ట్టి పీడిస్తోంద‌ని దానిని నిర్మూలించేందుకు ప్ర‌తి ఒక్క‌రు న‌డుం బిగించాల‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ పిలుపునిచ్చారు.

కేంద్ర ప్ర‌భుత్వం పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తోంద‌ని దీనిలో పాల్గొనాల‌ని కోరారు. దేశానికి స్వ‌తంత్రం వ‌చ్చి 75 ఏళ్లు పూర్త‌యిన సంద‌ర్భంగా న‌రేంద్ర మోదీ ఆదివారం జాతిని ఉద్దేశించి ప్ర‌సంగించారు.

ప్ర‌తి నెలా ఆఖ‌రి వారంలో ఏదో ఒక అంశంపై ప్ర‌ధాన మంత్రి(PM Modi)  మాట్లాడ‌తారు. అమృత్ మ‌హోత్స‌వ్ కు సంబంధించి అమృత్ ధార ఈనెల‌లో దేశం న‌లుమూల‌లు విస్త‌రిస్తుంద‌ని చెప్పారు.

పోష‌కాహార లోపం వ‌ల్ల ఎన్నో అన‌ర్థాలు సంభ‌విస్తాయ‌ని, ఆరోగ్య ప‌రంగా ఇబ్బందులు ఏర్ప‌డ‌తాయ‌ని అన్నారు. రాబోయే రోజుల్లో పోషకాహార లోపంతో ఏ ఒక్క‌రు ఉండ కూడ‌ద‌న్నారు.

ఇది త‌మ ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు. ఈ వ‌జ్రోత్స‌త ఉత్స‌వ వేళ‌లో దేశానికి సంబంధించిన సామూహిక శ‌క్తిని చూశామ‌న్నారు. వ‌చ్చే నెల‌లో పోష‌కాహార లోపంపై పోరాడేందుకు ప్ర‌జ‌లు సిద్దం కావాల‌ని ప్ర‌ధాని కోరారు.

పండ‌గుల‌తో పాటు సెప్టెంబ‌ర్ నెల పోషకాహారాన్ని నివారించేందుకు ఆ నెల‌ను అంకితం చేశామ‌న్నారు న‌రేంద్ర మోదీ. ఒక‌టి నుంచి 30 దాకా పోష‌కాహార మాసాన్ని జ‌రుపుకుంటామ‌న్నారు.

ఇదే స‌మ‌యంలో సాంకేతిక‌త మెరుగైన వినియోగం , ప్ర‌జల భాగ‌స్వామ్యం కూడా పోష‌ణ్ అభియాన్ లో భాగ‌మ‌య్యాయ‌ని చెప్పారు. భార‌త దేశాన్ని పోష‌కాహార లోప ర‌హితంగా మార్చ‌డంలో జ‌ల్ జీవ‌న్ మిష‌న్ పెద్ద ప్ర‌భావాన్ని చూపుతోంద‌న్నారు.

దూర‌ద‌ర్శ‌న్ లో స్వాతంత్ర స‌మ‌ర యోధుల గురించి ప్ర‌సారం చేస్తున్న స్వ‌రాజ్ సీరియ‌ల్ చూడాల‌ని కోరారు.

Also Read : త‌ల్లి ఆశీర్వాదం త‌న‌యుడు సంతోషం

 

Leave A Reply

Your Email Id will not be published!