China Corona : చైనాలో గందరగోళం ‘కరోనా’పై జనాగ్రహం
జిన్ పింగ్ రాజీనామా చేయాలని డిమాండ్
China Corona : జనాన్ని కంట్రోల్ చేయడం ప్రపంచంలో ఏ దేశాధినేతకు సాధ్యం కాలేదు. ఆ విషయం ఇంకా గమనించినట్లు లేదు చైనా చీఫ్ జిన్ పింగ్. ఆయన మరోసారి డ్రాగన్ దేశానికి సుప్రీంగా ఎన్నికయ్యారు. ఈ తరుణంలో జిన్ పింగ్ తీసుకున్న నిర్ణయం తీవ్ర నిరసనలు, ఆందోళనలకు దారి తీసింది.
ప్రస్తుతం చైనాలో ప్రజలు రోడ్డెక్కారు. తిరుగబాటు బావుటా ఎగురవేశారు. అంతే కాదు తుపాకులు ఎక్కు పెట్టినా వెనక్కి తగ్గడం లేదు. ప్రధానంగా కరోనా పేరుతో తమపై ఆంక్షలు(China Corona) విధించడాన్ని వారు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వేలాది మంది నిరసన బాట పట్టారు.
ఓ వైపు తుపాకులు ఎక్కు పెట్టినా వెనక్కి తగ్గడం లేదు. దేశ మంతటా ఇదే పరిస్థితి నెలకొంది. జిన్ పింగ్ తప్పుకోవాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. తమకు పీసీఆర్ టెస్టులు వద్దే వద్దంటూ డిమాండ్ చేస్తున్నారు. ఊహించని రీతిలో జనం నిరసన తెలపడం విస్తు పోయేలా చేసింది.
దీంతో అదుపు చేయడం కష్టతరంగా మారింది పోలీసులకు. జిన్ పింగ్ పాలన తమకు వద్దంటూ మండిపడుతున్నారు. వాటర్ కెనాన్లను, భాష్ప వాయువులను ప్రయోగించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. అంతే కాకుండా మరో వైపు షాంఘై లో కూడా ఆందోళనలు కొనసాగుతున్నాయి.
ఇక్కడ కూడా పరిస్థితి అదుపు తప్పుతోంది. ఇదిలా ఉండగా కరోనా మహమ్మారి ఇతర దేశాలలో తగ్గినా చైనాలో మాత్రం అంతంతకూ ఎక్కువవుతోంది. కేవలం ఒక్క రోజులోనే 40 వేల మంది కరోనా బారిన పడ్డారు. ఇంకా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ముందు జాగ్రత్తగా చైనా సర్కార్ కరోనాపై ఆంక్షలు విధించింది. దీనిపై జనం భగ్గుమంటున్నారు.
Also Read : పీఎస్ఎల్వీ – సీ54 సక్సెస్