Meta CEO Warning : జుక‌ర్ బ‌ర్గ్ స్ట్రాంగ్ వార్నింగ్

సోష‌ల్ మీడియాలో టాప్ లో కొన‌సాగుతున్న మెటా – ఫేస్ బుక్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే ఆర్థిక మాంద్యం ప్ర‌భావంతో ఐటీ, లాజిస్టిక్ , ఫార్మా, మీడియా, డెలివ‌రీ కంపెనీలు ఉద్యోగుల‌పై వేటు వేస్తోంది. గూగుల్, అమెజాన్ , సిస్కో, ఫిలిప్స్ , త‌దిత‌ర కంప‌నీల‌న్నీ ఇప్ప‌టి వ‌ర‌కు 80 వేల‌కు పైగా సాగ‌నంపాయి.

తాజాగా మెటా, ఫేస్ బుక్ సిఇఓ మార్క్ జుక‌ర్ బ‌ర్గ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మెటాలో ప‌ని చేస్తున్న కీల‌క‌మైన పోస్టుల‌లో ఉన్న మేనేజ‌ర్ల‌కు బిగ్ షాక్ ఇచ్చారు. ప‌నిలో వ్య‌క్తిగ‌త ప్ర‌తిభ త‌ప్ప‌క ఉండాల్సిందేన‌ని, లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు. ఏ మాత్రం తేడా వ‌చ్చినా ఊరుకోన‌ని స్ప‌ష్టం చేశారు సిఇఓ.