Mopidevi Venkata Ramana : సీట్లను అమ్ముకున్న ద్రోహి ‘బాబు’
ఎంపీ మోపిదేవి వెంకట రమణ కామెంట్స్
Mopidevi Venkata Ramana : వైస్సార్సీపీ ఎంపీ మోపిదేవి వెంకట రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజ్యసభ సీట్లను అమ్ముకున్న చరిత్ర నారా చంద్రబాబు నాయుడిదని ఆరోపించారు. ఎన్నికల్లో లబ్ది పొందేందుకు బీసీల నినాదం ఎత్తుకున్నారంటూ మండిపడ్డారు. అసలు వెనుకబడిన తరగతుల కులాలకు ఏం చేశారో చెప్పాలన్నారు. అమర్నాథ్ హత్యకు రాజకీయ కారణాలంటూ ఏవీ లేవన్నారు మోపిదేవి వెంకట రమణ.
Mopidevi Venkata Ramana Comments
తమ నాయకుడు, ఏపీ సీఎం జగన్ రెడ్డి హయాంలోనే బీసీలకు సామాజిక, ఆర్థిక, రాజకీయ గుర్తింపు లభించిందని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీసీలు తమ నాయకుడి వెంట ఉంటారని అన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. బాబు కుటిల రాజకీయాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు ఎంపీ మోపిదేవి.
నిత్యం అబద్దాలతో గోబెల్స్ ప్రచారానికి శ్రీకారం చుట్టిందే చంద్రబాబు నాయుడంటూ మండిపడ్డారు. రాజకీయాలను భ్రష్టు పట్టించిన ఘనత ఆయనదేనంటూ ఎద్దేవా చేశారు ఎంపీ మోపిదేవి(Mopidevi Venkata Ramana). తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు లోకేష్ అంటూ ఫైర్ అయ్యారు. జగన్ రెడ్డిని విమర్శించేంత సీన్ లేదన్నారు ఎంపీ.
బాధిత కుటుంబాన్ని పరామర్శించామన్నారు. రూ. 10 లక్షలు సాయంగా అందజేశామని కానీ చంద్రబాబు నాయుడు దీనిని కూడా రాజకీయం చేయాలని చూస్తున్నారంటూ ఎంపీ మోపిదేవి వెంకట రమణ ఆరోపించారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు.
Also Read : AP CM YS Jagan : అంతటా అప్రమత్తంగా ఉండండి – జగన్