Nirmala Sitharaman : అప్పుల కుప్పగా మారిన తెలంగాణ
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
Nirmala Sitharaman : హైదరాబాద్ – తెలంగాణలో కొలువు తీరిన బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదన్నారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman). మంగళవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె జూబ్లీ హిల్స్ లో పార్టీ అభ్యర్థి తరపున ప్రసంగించారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ ను ఏకి పారేశారు. కేసీఆర్ తెలంగాణను సర్వ నాశనం చేశారని ఆరోపించారు. మొత్తంగా భ్రష్టు పట్టించారంటూ ధ్వజమెత్తారు.
Nirmala Sitharaman Shocking Comments
దేశంలో అత్యధిక ద్రవ్యోల్బణం కలిగిన రాష్ట్రంగా తెలంగాణ ఉందని ఎద్దేవా చేశారు. బంగారు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనుడు కేసీఆర్ అంటూ మండిపడ్డారు. ఇప్పటి వరకు ప్రారంభించిన ప్రాజెక్టును ఒక్కటి కూడా పూర్తి చేయలేదన్నారు నిర్మల సీతారామన్.
హైదరాబాద్ లో ఇప్పటి వరకు ఉన్న పరిశ్రమలను చూపిస్తున్నారే తప్పా కొత్త వాటి గురించి ఎందుకు ఊసెత్తడం లేదంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో 2 లక్షలకు పైగా జాబ్స్ ఖాళీగా ఉన్నా ఎందుకు ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదంటూ మండిపడ్డారు.
తెలంగాణ ఏర్పాటుతో కేవలం కల్వకుంట్ల కుటుంబం మాత్రమే బాగు పడిందన్నారు నిర్మలా సీతారామన్.
దేశంలో ఎక్కడా లేనంతటి అవినీతి, అక్రమాలకు కేరాఫ్ గా మారిందన్నారు. రైతులకు మద్దతు ధర ఎందుకు ఇవ్వడం లేదంటూ ప్రశ్నించారు.
Also Read : Priyanka Gandhi Tour : ప్రియాంక సుడిగాలి పర్యటన