PAK vs NZ 1st Test 2022 : స‌త్తా చాటిన బాబ‌ర్ ఆజ‌మ్

పాకిస్తాన్ కెప్టెన్ బాబ‌ర్ ఆజ‌మ్ స‌త్తా చాటాడు. అద్భుత‌మైన సెంచ‌రీతో ఆక‌ట్టుకున్నాడు. పాకిస్తాన్ టూర్ లో భాగంగా న్యూజిలాండ్ తో జ‌రుగుతున్న మొద‌టి టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు ఆజ‌మ్. కీవీస్ బౌల‌ర్ల‌ను ధాటిగా ఎదుర్కొన్నాడు. గ‌త కొంత కాలంగా త‌న ఫామ్ ను కొన‌సాగిస్తూ వ‌స్తున్నాడు స్కిప్ప‌ర్ బాబ‌ర్ ఆజ‌మ్.

ఇటీవ‌ల ఇంగ్లండ్ తో ఆడిన మూడు టెస్టుల్లోనూ పాకిస్తాన్ ఓట‌మి పాలైంది. దీంతో తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నాడు కెప్టెన్. ఈ స‌మ‌యంలో పూర్తి ప‌ట్టు సాధించేలా ప‌ట్టుద‌ల‌తో ఆడాడు బాబ‌ర్ ఆజ‌మ్. ఏకంగా 161 ప‌రుగుల‌తో నాటౌట్ గా నిలిచాడు. కీవీస్ జ‌ట్టుపై తీవ్ర ఒత్తిడి పెంచాడు.