Babar Azam : భారత ఆటగాళ్ల స్నేహానికి పాక్ కెప్టెన్ ఫిదా
గాయపడిన షాహీన్ అఫ్రిదికి పలకరింపు
Babar Azam : యావత్ ప్రపంచం యూఏఈ వేదికగా ఆదివారం దాయాది దేశాల మధ్య కీలక పోరుకు సిద్దమవుతున్నాయి. ఈ తరుణంలో పాకిస్తాన్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
భారత ఆటగాళ్ల స్నేహానికి తాను ఫిదా అయినట్లు ఇవాళ పేర్కొన్నాడు. వారి ప్రవర్తన, హృదయ పూర్వకమైన పలకరింపు తమ మనస్సుల్ని తాకిందని ప్రశంసించాడు.
ఒక రకంగా ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య విభేదాలు ఉంటాయని అంతా అనుకుంటారు. కానీ భారత్, పాకిస్తాన్ దేశాల(IND vs PAK) మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
మ్యాచ్ జరిగే కంటే ముందు ట్రైనింగ్ శిషన్ లో ఫుల్ ప్రాక్టీస్ లో నిమగ్నం అయ్యారు. రెండు శిబిరాలకు చెందిన ఆటగాళ్లు ఆనందాన్ని పంచుకున్నారు.
విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ , యుజ్వేంద్ర చాహల్ , రిషబ్ పంత్ వంటి దిగ్గజాలు షాహీన్ షా అఫ్రిదీని కలిశారు. అతడికి కలిగిన గాయం గురించి, ఎంత దాకా వచ్చిందని అడగడం తనను మరింత విస్తు పోయేలా చేసిందన్నాడు బాబర్ ఆజం(Babar Azam).
ప్రేమగా పలకరించిన విధానం తనను మరింత ప్రేమించేలా చేసిందన్నాడు. అతడికి మద్దతు తెలిపిన విధానం మమ్మల్ని మరింత ఆనందం కలిగించిదన్నాడు.
ఆటగాళ్లు పరస్పరం సంభాషించుకునే దృశ్యాలు కూడా హృదయ పూర్వకంగా ఉన్నాయని తెలిపాడు. విచిత్రం ఏమిటంటే మ్యాచ్ వరకు వచ్చేసరికి అభిమానులు, దేశాల మధ్య పోటీ ఉంటుందని అనుకుంటారని వాపోయాడు బాబర్ ఆజమ్.
కాగా బాబర్ ఆజం పేరుతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధికారికంగా విడుదల చేసింది.
Also Read : చతేశ్వర్ పుజారా ఇండియా టీమ్ ఇదే