Phil Salt : సాల్ట్ విధ్వంసం అద్భుతం

శివ మెత్తిన ఫిల్ సాల్ట్

Phil Salt : ప్ర‌పంచ క్రికెట్ ను పొట్టి ఫార్మాట్ టి20 శాసిస్తోంది. వ‌ర‌ల్డ్ వైడ్ గా వివిధ ఫార్మాట్ ల‌లో ఎన్నో లీగ్ లు కొన‌సాగుతున్నాయి. కానీ భార‌త క్రికెట్ కంట్ర‌లో బోర్డు (బీసీసీఐ) ఏ ముహూర్తాన ల‌లిత్ మోడీ ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (ఐపీఎల్ ) ను ప్రారంభించాడో ఆనాటి నుంచి నేటి దాకా సూప‌ర్ స‌క్సెస్ తో దుమ్ము రేపుతోంది. కోట్లాది మందిని మెస్మ‌రైజ్ చేస్తూ ముందుకు సాగుతోంది. ఒక‌టా రెండా ఏకంగా బీసీసీఐకి రూ. 45,000 కోట్ల ఆదాయాన్ని స‌మ‌కూర్చి పెట్టింది.

యువ ఆట‌గాళ్ల‌కు ఐపీఎల్ ఓ వ‌రంగా మారింది. క‌ళ్లు చెదిరే షాట్స్ తో దుమ్ము రేపుతుంటే మ‌రో వైపు సీనియ‌ర్ ప్లేయ‌ర్లు త‌మ అనుభ‌వాన్ని రంగ‌రించి షాన్ దార్ ఆట తీరుతో షాక్ ఇస్తున్నారు. తాజాగా జ‌రుగుతున్న ఐపీఎల్(IPL 2023) 16వ సీజ‌న్ లో రికార్డులు బ‌ద్ద‌లవుతున్నాయి. ఇప్ప‌టికే న‌మోదైన రికార్డులు తుడిచి పెట్టుకు పోతున్నాయి.

తాజాగా ఢిల్లీ వేదిక‌గా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో జ‌రిగిన కీల‌క పోరులో ఢిల్లీ క్యాపిట‌ల్స్ చుక్క‌లు చూపించింది. స్టార్ ఇంగ్లండ్ క్రికెటర్ ఫిల్ సాల్ట్ శివ‌మెత్తాడు. పూన‌కం వ‌చ్చిన‌ట్లు దంచి కొట్టాడు. ఆర్సీబీ బౌల‌ర్ల‌కు నిద్ర లేకుండా చేశాడు.

ఫిల్ సాల్ట్(Phil Salt) కేవ‌లం 45 బంతులు మాత్ర‌మే ఎదుర్కొన్నాడు. 87 ర‌న్స్ చేశాడు. ఇందులో 6 సిక్స‌ర్లు, 8 ఫోర్లు ఉన్నాయి. ఒక ర‌కంగా మార‌థాన్ ఇన్నింగ్స్ తో త‌న‌కు ఎదురే లేద‌ని చాటాడు. ప్ర‌స్తుతం ఐపీఎల్ లో వీడు మగాడ్రా బుజ్జీ అంటున్నారు ఫ్యాన్స్.

Also Read : శివ‌మెత్తిన సాల్ట్ బెంగ‌ళూరుకు షాక్

Leave A Reply

Your Email Id will not be published!