Made In India : మేడ్ ఇన్ ఇండియాపై మోదీ ఫోకస్
ఐఫోన్ తయారీ ఇక్కడే
Made In India : దేశ ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ కొలువు తీరిన తర్వాత మేడ్ ఇన్ ఇండియా అన్న నినాదం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయన మాట్లాడిన ప్రతిసారి ఈ దేశం అన్ని రంగాలలో స్వయం సమృద్దిని సాధించాలని పదే పదే పిలుపునిస్తున్నారు.
Made In India is Modi Ruling
ఇతర దేశాల నుంచి వస్తువులను దిగుమతి చేసుకోవడం మానేయాలని మనమే వాటిని తయారు చేసుకునే స్థితికి చేరుకోవాలని స్పష్టం చేశారు. ఈ మేరకు స్టాండప్ ఇండియా పేరుతో ప్రోగ్రాం కూడా స్టార్ట్ చేశారు. కోట్లాది రూపాయలు భారత్ లో ఉంటున్న ఔత్సాహికులకు, వ్యాపారవేత్తలకు, తయారీదారులకు ఊతం ఇచ్చేలా చేశారు. ఇది మంచి ఫలితాలను ఇచ్చింది.
నిన్నటి దాకా మేడ్ ఇన్ చైనానే ప్రపంచ మార్కెట్ ను శాసిస్తూ వచ్చింది. కానీ మోదీ(PM Modi) దానిని రూపుమాపేందుకు కంకణం కట్టుకున్నారు. ఎమర్జింగ్ ఇండియా కావాలన్నదే తన ముందున్న లక్ష్యమని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా భారీ ఎత్తున వరల్డ్ లో టాప్ లో కొనసాగుతున్న కంపెనీలకు వెసులుబాటు కల్పిస్తూనే భారీగా ప్రోత్సాహకాలు అందజేస్తుండడంతో ఇండియాకు క్యూ కట్టాయి కంపెనీలు.
తాజాగా ప్రపంచంలోనే మొబైల్ యాక్ససరీస్ తయారీలో నెంబర్ 1 గా ఉన్న ఫాక్స్ కాన్ ఇప్పుడు చైనాను కాకుండా ఇండియాను ఎంచుకుంది. తాజాగా 400 డాలర్లతో హైదరాబాద్ లో యాపిల్ ఫోన్ ఇయర్ బడ్స్ ను తయారు చేసే ప్లాంట్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు .
Also Read : Nara Lokesh : వీసీ పోస్టులను బేరం పెట్టిన జగన్