Rahul Gandhi : నెహ్రూ మెమోరియల్ పేరు మార్పు
నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ
Rahul Gandhi : దేశంలో కొలువు తీరిన మోదీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆనవాళ్లు ఏవీ లేకుండా చేయాలని అనుకుంటోంది. ఇప్పటికే పలు అవార్డులు, చారిత్రక స్థలాలు, మ్యూజియంలకు సంబంధించి ఉన్న పేర్లను తేసేసే పనిలో పడింది. దేశంలో సవాలక్ష సమస్యలు కొలువు తీరినా దానిని పరిష్కరించేందుకు ప్రయత్నం చేయని ప్రధాని మోదీ పేర్ల మార్పుపై ఎక్కువగా ఫోకస్ పెట్టడం కలకలం రేపుతోంది. విపక్షాలు ఆయనను పదే పదే విమర్శిస్తూ వస్తున్నాయి.
Rahul Gandhi Slams Modi Govt
తాజాగా భారత దేశానికి చెందిన తొలి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ కు సంబంధించి ఏర్పాటు చేసిన నెహ్రూ మెమోరియల్ పేరు మారుస్తున్నట్లు కేంద్ర సర్కార్ ప్రకటించింది. దీనిపై కాంగ్రెస్ అగ్ర నాయకుడు, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) గురువారం స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడారు.
నెహ్రూకు సంబంధించిన పేర్లను మోదీ తొలగించవచ్చు. కానీ ఆయన భారత దేశం ఉన్నంత కాలం , చరిత్ర ఉన్నంత కాలం జవహర్ లాల్ నెహ్రూ తొలి ప్రధానమంత్రిగా కలకలం నిలిచే ఉంటారని స్పష్టం చేశారు. నెహ్రూ ఒక వ్యక్తి కాదు శక్తి. ఈ దేశంలో సమూలమైన మార్పులు తీసుకు వచ్చిన అరుదైన నాయకుడు.
ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకానికి పెట్టిన మోదీకి ఎలాంటి హక్కు లేదన్నారు. ఏది ఏమైనా నెహ్రూ గుర్తింపు ఆయన చేసిన పనుల వల్ల వస్తుందన్నారు. నెహ్రూ మెమోరియల్ పేరు మార్పు వల్ల కాదన్నారు రాహుల్ గాంధీ.
Also Read : Vaibhav Taneja : మస్క్ మెచ్చిన వైభవ్ తనేజా