Ramiz Raja : పాక్ ను చూసి భార‌త్ నేర్చుకుంది – ర‌మీజ్

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మ‌న్ ప‌ద‌వి నుంచి అనూహ్యంగా తొల‌గించ‌బ‌డిన ర‌మీజ్ ర‌జా మ‌రోసారి నోరు పారేసుకున్నారు. ఇప్ప‌టికే పీసీబీపై, దాని చైర్మ‌న్ పై నిప్పులు చెరిగారు. తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. తాను చైర్మ‌న్ గా వ‌చ్చాకే పాకిస్తాన్ జ‌ట్టులో కీల‌క మార్పులు చేశాన‌ని చెప్పారు.

అంతేకాదు భార‌త జ‌ట్టు పాకిస్తాన్ ను ఢీకొన లేక పోయింద‌న్నాడు. దుబాయ్ లో జ‌రిగిన టీ20 ఐసీసీ వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాకిస్తాన్ చేతిలో టీమిండియా ఏకంగా 10 వికెట్ల తేడాతో ఓట‌మి పాలైంద‌ని ఎద్దేవా చేశాడు. అంతే కాదు ఈ ఏడాది 2022 ఆస్ట్రేలియాలో జ‌రిగిన ఐసీసీ టీ20 వర‌ల్డ్ క‌ప్ లో అనూహ్యంగా ఫైన‌ల్ కు పాకిస్తాన్ చేరింద‌న్నాడు.

దీనికి ప్ర‌ధాన కార‌ణం తాను తీసుకున్న నిర్ణ‌యాలేన‌ని పేర్కొన్నాడు. ప‌లు సీరీస్ లు కూడా గెలిచిన విష‌యాన్ని గుర్తు పెట్టు కోవాల‌న్నాడు. ఇదిలా ఉండ‌గా కొత్త‌గా ఎన్నికైన చైర్మ‌న్ న‌జామ్ సేథీ పాత కార్య‌వ‌ర్గాల‌ను పూర్తిగా రద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. అంతే కాకుండా తాత్కాలిక చీఫ్ సెలెక్ట‌ర్ గా షాహీద్ అఫ్రిదీని నియ‌మించారు.