Revanth Reddy Posters : రేవంత్ రెడ్డిపై పోస్టర్స్ కలకలం
రాహుల్, సోనియాకు వ్యతిరేకంగా
Revanth Reddy Posters : హైదరాబాద్ – తెలంగాణలో పోస్టర్ల యుద్దం కొనసాగుతోంది. అధికారంలో కొనసాగుతున్న భారత రాష్ట్ర సమితి , ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీలు పోస్టర్ల యుద్దానికి తెర లేపాయి. నిన్న, ఇవాళ ఏఐసీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాలు కొనసాగుతున్నాయి.
Revanth Reddy Posters Viral
ఈ తరుణంలో ఇప్పటి వరకు దేశాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్ని స్కాములు జరిగాయో, ఎవరెవరికి ఎంతెంత వాటా ఉందో అనే విషయాన్ని పెద్ద ఎత్తున నగరమంతటా పోస్టర్లు వేశారు. తాజాగా టీపీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డిని(Revanth Reddy) టార్గెట్ చేశారు .
ఆయన గతంలో టీఆర్ఎస్, టీడీపీలో కొనసాగారు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీని, సీపీపీ చైర్ పర్సన్ సోనియా గాంధీని విమర్శించారు. నానా తిట్లు తిట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
ఆనాడు సోనియా తెలంగాణకు పట్టిన దరిద్రం అన్న రేవంత్ రెడ్డి ఇవాళ సోనియమ్మ తెలంగాణకు దేవతమ్మ అంటూ పొగడడం ఎంత వరకు సబబు అని ప్రశ్నిస్తున్నాయి బీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు. తాజాగా ముద్ద పప్పు రాహుల్ గాంధీ, బలి దేవత సోనియమ్మకు స్వాగతం అంటూ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్స్ వెలిశాయి. కలకలం రేపుతున్నాయి ఇవి.
Also Read : DK Shiva Kumar : సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ భేష్