Jay Shah Rishabh Pant : కోలుకుంటున్న రిషబ్ పంత్ – జే షా
ఢిల్లీ నుండి ఉత్తరాఖండ్ కు వెళుతుండగా రూర్కీ సమీపంలో ప్రముఖ క్రికెటర్ రిషబ్ పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. స్వయంగా తానే కారును నడుపుకుంటూ వెళ్లాడు. ఇదిలా ఉండగా తను నిద్రలో ఉండి నడిపాడని అందుకే కారు డివైడర్ ను ఢీకొట్టిందని సమాచారం. తీవ్రంగా గాయపడిన రిషబ్ పంత్ ను స్థానిక రూర్క్ ఆస్పత్రికి తరలించారు.
అక్కడ చికిత్స చేసిన అనంతరం డెహ్రాడూన్ ప్రధాన ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా రిషబ్ పంత్ త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు, క్రికెటర్లు, మాజీ ఆటగాళ్లు, ప్రముఖులు కోరారు. ఇదిలా ఉండగా రిషబ్ పంత్ ఆరోగ్యంపై కీలక ప్రకటన చేశారు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కార్యదర్శి జే షా.
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed