RK Roja Pawan Kalyan : సంస్కారం గురించి పవన్ చెబితే ఎలా
ఏపీ మంత్రి ఆర్కే రోజా షాకింగ్ కామెంట్స్
RK Roja Pawan Kalyan : ఏపీలో రాజకీయాలు మరింత వేడిని రాజేస్తున్నాయి. ఇంకా ఎన్నికల సమయం ఉన్నప్పటికీ అధికారంలో ఉన్న వైసీపీని ప్రతిపక్షాలు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నేతలు టార్గెట్ చేశారు. ఏపీ సర్కార్ పై, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్.
వైసీపీ పాలనలో 219 దేవాలయాలు దాడులకు గురయ్యాయని, సంస్కారం లేని హీనులు ఏపీ మంత్రులు, సీఎం అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు జనసేన పార్టీ చీఫ్. దీనిపై తీవ్రంగా స్పందించారు ఏపీ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా.
సంస్కారం, సభ్యత గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడటం దారుణంగా ఉందన్నారు. ఒక రకంగా చెప్పాలంటే పోర్న్ స్టార్ సన్నీ లియోన్ వేదాలు వల్లించినట్లుగా ఉందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి ఆర్కే రోజా(RK Roja). ఏపీ సీఎం జగన్ దమ్మున్న లీడర్ అని ఆయనను తట్టుకుని నిలబడే మగాళ్లు ఎవరూ లేరన్నారు మంత్రి.
నిరాధారమైన ఆరోపణలు చేస్తూ నోటికి వచ్చినట్లు మాట్లాడటం పవన్ కళ్యాణ్ కే చెల్లిందన్నారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. ఏదైనా రాజకీయంగా ఎదుర్కోవాలంటే వ్యక్తిగతంగా విమర్శలు చేయడం మాను కోవాలని హితవు పలికారు. లేక పోతే ప్రజలు ఈసారి ఎన్నికల్లో బుద్ది చెప్పడం ఖాయమని జోష్యం చెప్పారు ఆర్కే రోజా.
Also Read : Satya Nadella Shahrukh : క్రికెట్ లో సత్య నాదెళ్ల..షారుఖ్ ఇన్వెస్ట్
