Rohini Acharya Lalu CBI : సీబీఐకి లాలూ కూతురు వార్నింగ్
మా నాన్నకు ఏమైనా జరిగితే ఊరుకోను
Rohini Acharya Lalu CBI : భూ, జాబ్స్ స్కామ్ లకు సంబంధించి మాజీ బీహార్ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ ను మంగళవారం సీబీఐ విచారించింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఆయన భార్య, మాజీ సీఎం రబ్రీ దేవిని కూడా సోమవారం విచారణ చేపట్టింది.
ఆమె నుంచి వాంగ్మూలం కూడా తీసుకుంది. తాము సోదాలు లేదా దాడులు జరిపేందుకు రాలేదని స్పష్టం చేసింది సీబీఐ. ఇదే కేసుకు సంబంధించి లాలూ ప్రసాద్ యాదవ్ ను విచారించింది. గతంలో ఆయన కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా పని చేశారు.
ఆ సమయంలోనే పెద్ద ఎత్తున జాబ్స్ ఇప్పిస్తామంటూ డబ్బులు వసూలు చేశారంటూ ఆరోపణలు వచ్చాయి. ఇప్పటికే లాలూ దాణా కుంభ కోణం కేసులో జైలు పాలయ్యారు. ఇటీవల అనారోగ్యం కారణంగా బయటకు వచ్చారు. కూతురు తన కిడ్నీ దానం చేయడంతో లాలూ ప్రసాద్ యాదవ్ బతికి బయట పడ్డారు. ఆమె సింగపూర్ లో ఉంటున్నారు.
ఈ సందర్బంగా తన తండ్రి అనారోగ్యంతో ఉన్నారని ఏ మాత్రం ఇబ్బంది పెట్టినా లేదా ఏమైనా జరిగినా తాను ఊరుకోబోనంటూ హెచ్చరించారు రోహిణి ఆచార్య(Rohini Acharya Lalu CBI). ఆయనకు రెండో కూతురుగా ఉన్నారు. సీబీఐ తన తండ్రిని వేధిస్తున్న తీరు సరికాదని ఆరోపించారు.
ట్విట్టర్ వేదికగా ఆమె స్పందించారు. ఇవన్నీ గుర్తుండి పోతాయని, సమయం చాలా శక్తివంతమైనదని పేర్కొన్నారు. తమకు ఓ సమయం వస్తుందని స్పష్టం చేశారు రాహిణి ఆచార్య. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
Also Read : జాబ్స్ కేసులో లాలూకు సీబీఐ ఝలక్