Salaar Teaser : రేపే స‌లార్ టీజ‌ర్ రిలీజ్

స‌ర్వ‌త్రా నీల్ చిత్రంపై ఉత్కంఠ

Salaar Teaser : భార‌త దేశంలో మోస్ట్ ప‌వ‌ర్ ఫుల్ , వాంటెడ్ డైరెక్ట‌ర్ గా గుర్తింపు పొందాడు క‌న్న‌డ సినీ రంగానికి చెందిన ప్ర‌శాంత్ నీల్. అత‌డి టేకింగ్, మేకింగ్ వీర లేవ‌ల్లో ఉంటుంది. రైజింగ్ స్టార్ య‌ష్ తో తీసిన కేజీఎఫ్ భార‌తీయ సినిమా రంగాన్ని ఒక ఊపు ఊపింది. పాన్ ఇండియా లెవ‌ల్లో చ‌ర్చ‌కు దారి తీసింది. ఆపై ఇదే న‌టుడితో కేజీఎఫ్ -2 తో తీసిన చిత్రం కోట్లు కొల్ల‌గొట్టింది. ప్ర‌శాంత్ నీల్ ద‌మ్ము ఏంటో చూపించింది. ఇదే క్ర‌మంలో డార్లింగ్ ప్ర‌భాస్ తో స‌లార్ మూవీ తీశాడు.

కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చు చేసి తీశాడు. అస‌లే పాన్ ఇండియా డైరెక్ట‌ర్ మ‌రో వైపు పాన్ ఇండియా హీరో ఇద్ద‌రూ క‌లిస్తే ఎలా ఉంటుందో సినిమా అన్న ఉత్కంఠ అంత‌టా నెల‌కొంది. ఇందులో భాగంగా ప్ర‌భాస్ న‌టిస్తున్న ఈ చిత్రానికి స‌లార్(Salar) అని పేరు పెట్టాడు ద‌ర్శ‌కుడు నీల్. దీనికి సంబంధించిన పోస్ట‌ర్లు దుమ్ము రేపాయి. నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

తాజాగా స‌లార్ కు సంబంధించి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న క్ష‌ణాలు రానే వ‌చ్చాయి. మూవీ మేక‌ర్స్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఈ మేర‌కు జూలై 6న గురువారం తెల్ల వారు జామున 5.12 గంట‌ల‌కు స‌లార్ టీజ‌ర్ ను విడుద‌ల చేస్తామ‌ని వెల్ల‌డించారు. దీంతో ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఎలా ఉంటుందోన‌న్న ఉత్కంఠ నెల‌కొంది. మొత్తంగా ఆది పురుష్ త‌ర్వాత వ‌స్తున్న పాన్ ఇండియా మూవీ కావ‌డంతో భారీ అంచ‌నాలు ఉన్నాయి.

Also Read : Jaya Kishori Gadkari : గ‌డ్క‌రీతో జ‌యా కిషోరీ భేటీ

Leave A Reply

Your Email Id will not be published!