Samatha Kumbh Utsav 2023 : స్పూర్తి కేంద్రం భ‌క్తజ‌నం పునీతం

ముగిసిన స‌మ‌తా కుంభ్ ఉత్సవాలు 2023

Samatha Kumbh Utsav 2023 : విశ్వ శాంతి కోసం శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయ‌ర్ స్వామి వారి ప‌ర్వవేక్ష‌ణ‌లో శంషాబాద్ లోని దివ్య సాకేతం, స‌మ‌తా స్పూర్తి కేంద్రంలో 10 రోజుల పాటు జ‌రిగిన స‌మ‌తా కుంభ్ 2023 ఉత్స‌వాలు(Samatha Kumbh Utsav 2023) ముగిశాయి. ఈ ఉత్స‌వాలు ఫిబ్ర‌వ‌రి 2 నుంచి 12 వ‌ర‌కు కొన‌సాగాయి.

ప్ర‌తిరోజు పూజ‌లు, కైంక‌ర్యాలు, స్వామి వారి ప్ర‌వ‌చ‌నాలతో భ‌క్త జ‌న‌సందోహంతో నిండి పోయింది. ప్ర‌తి రోజూ వేలాది మంది భ‌క్త బాంధ‌వులు పాల్గొన్నారు. స్వామి వారి కృప‌కు పాత్రుల‌య్యారు. తీర్థ గోష్టి, ప్ర‌సాద విత‌ర‌ణ జ‌రిగింది.

భ‌గ‌వ‌ద్గీత ప్రాశ‌స్త్యం గురించి బోధించారు శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయ‌ర్ స్వామి నిర్వాహ‌కులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. భ‌క్త బాంధ‌వుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూశారు. తెలుగు రాష్ట్రాల‌తో పాటు దేశంలోని న‌లుమూల‌ల నుంచి , విదేశాల నుంచి త‌ర‌లి వ‌చ్చారు భ‌క్తులు. 

స‌మ‌తా కుంభ్ ఉత్స‌వాల‌లో (Samatha Kumbh Utsav 2023) భాగంగా ఫిబ్ర‌వ‌రి 2న దివ్య సాకేతంలో పూజ‌ల‌తో ప్రారంభ‌మైంది. 11 నుంచి 1 గంట దాకా దిష్వ‌క్సేన కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు. మధ్యాహ్నం 1.30 గంట‌ల‌కు తీర్థ‌, ప్ర‌సాద విత‌ర‌ణ , సాయంత్రం 5 నుంచి 5.45 గంట‌ల‌కు శ్రీ విష్ణు స‌హస్ర పారాయ‌ణం దాని విశిష్ట‌త గురించి వివ‌రించారు.  6.00 నుంచి 6.30 దాకా అంకురారోహ‌ణ వైన‌తేయ ప్ర‌తిష్ట జ‌రిగింది, రాత్రి 8.30 గంట‌ల‌కు తీర్థ‌, ప్ర‌సాద విత‌ర‌ణతో పూర్త‌యింది.

3న సూర్య ప్ర‌భ వాహ‌న సేవ కొన‌సాగింది. ఉద‌యం 6 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 1.30 దాకా దివ్య సాకేతంలోని యాగ‌శాల‌లో ధ్వ‌జారోహ‌ణం జ‌రిగింది. సాయంత్రం 5.00 నుంంచి 5.45 గంట‌ల దాకా శ్రీ విష్ణు స‌హ‌స్ర పారాయ‌ణం, 6.00 నుంచి 6.30 దాకా వేదిక‌పై అంకురారోహ‌ణ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు. 6.30 నుంచి 8.30 దాకా చంద్ర‌ప్ర‌భ వాహ‌న సేవ ఘ‌నంగా జ‌రిగింది.

4న ఉద‌యం నుంచి మ‌ధ్యాహ్నం 1.30 గంట‌ల దాకా సామూహిక పారాయ‌ణం, 1.30 నుంచి 4.00 గంట‌ల దాకా ప్ర‌పంచ క్యాన్స‌ర్ దినోత్స‌వం సంద‌ర్భంగా వికాస త‌రంగిణి ఆధ్వ‌ర్యంలో కార్య‌క్ర‌మాలు ఘ‌నంగా నిర్వ‌హించారు. సాయంత్రం 6.00 గంట‌ల నుంచి రాత్రి 8.30 గంట‌ల వ‌ర‌కు శేష వాహ‌న సేవ‌, హంస వాహ‌న సేవ ఘ‌నంగా నిర్వ‌హించారు. 18 గ‌రుడ సేవ‌లు కొన‌సాగాయి. 

అనంత‌రం తీర్థ‌, ప్ర‌సాదం అంద‌జేశారు. 5న 108 రూపాల‌లో శాంతి క‌ళ్యాణ మ‌హోత్స‌వం ప్ర‌ధాన వేదిక‌పై అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హించారు. 6న ఉద‌యం 11. 30 గంట‌ల‌కు వ‌సంతోత్స‌వం. సాయంత్రం 6. 00 నుంచి రాత్రి 8.30 గంట‌ల వ‌ర‌కు గ‌రుడ సేవ చేప‌ట్టారు. 7న ఉద‌యం 11.30 గంట‌ల‌కు డోలోత్స‌వం నిర్వ‌హించారు. సాయంత్రం 6.00 నుంచి రాత్రి 8.30 గంట‌ల వ‌ర‌కు సాకేత రామ‌చంద్ర ప్ర‌భువుకు హ‌నుమ‌ద్వాహ‌న సేవతో పాటు 18 గ‌రుడ సేవ‌లు చేప‌ట్టారు.

8న ఉద‌యం 11.30 గంట‌ల‌కు క‌ళ్యాణోత్స‌వంతో పాటు సామూహిక పుష్పార్చ‌న ఘ‌నంగా నిర్వ‌హించారు. మ‌ధ్యాహ్నం 1.30 గంట‌ల నుండి 4.30 గంట‌ల వ‌ర‌కు భ‌గ‌వ‌ద్గీత‌లో సూప‌ర్ మెమోరీ టెస్టు చేప‌ట్టారు. అమెరికాతో పాటు దేశానికి చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. సాయంత్రం 4.30 గంట‌ల‌కు తెప్పోత్స‌వం నిర్వ‌హించారు. 

9న ఉద‌యం 108 దివ్య దేశాల స‌మ‌ర్ప‌ణ కార్య‌క్రమాన్ని వైభ‌వంగా నిర్వహించారు. సాయంత్రం 5.00 నుంచి 5.45 శ్రీ విష్ణు స‌హ‌స్ర పారాయ‌ణం జ‌రిగింది. 5 గంట‌ల‌కు ప్ర‌త్యేక వేదిక‌పై సామూహిక ఉప‌న‌య‌న కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు. 6.00 నుంచి రాత్రి 8.30 గంట‌ల‌కు గ‌రుడ సేవ‌లు నిర్వ‌హించారు. 

10న ప్ర‌త్యేక వేదికపై సామూహిక ఉప‌న‌య‌న కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు. సాయంత్రం 6.00 నుంచి రాత్రి 8.30 గంట‌ల‌కు గ‌జ వాహ‌న సేవ‌తో పాటు 18 గ‌రుడ సేవ‌లు అంగ‌రంగ వైభ‌వోపేతంగా చేప‌ట్టారు. 11న ఉద‌యం 9 గంట‌ల‌కు ర‌థోత్స‌వం , నిత్య పూర్ణ హార‌తి , చ‌క్ర స్నానం నిర్వ‌హించారు. మ‌ధ్యాహ్నం విశ్వ శాంతి కోసం గీతా పారాయ‌ణం అద్భతంగా సాగింది.

12న సాకేత రామ‌చంద్ర ప్ర‌భువుకు దివ్య సాకేతంలో పూజ‌లు స్వామి వారి ప‌ర్య‌వేక్ష‌ణ‌లో స‌మ‌తా కుంభ్ 2023 ఉత్స‌వాలు(Samatha Kumbh Utsav 2023) జ‌రిగాయి. మ‌ధ్యాహ్నం 3.00 గంట‌ల‌కు పుష్ప యాగం , దేవ‌తా ధ్యాన‌వ‌నం , మ‌హా పూర్ణ హార‌తి, ధ్వ‌జారోహ‌ణం చేప‌ట్టారు. భ‌క్త జ‌న‌సందోహంతో నిండి పోయింది దివ్య సాకేతం.

Also Read : యాదగురిగుట్ట‌ త‌ర‌హాలో కొండ‌గ‌ట్టు

Leave A Reply

Your Email Id will not be published!