అద్భుతమైన బంతులతో ప్రత్యర్థులకు చుక్కలు చూపించే బౌలర్ గా పేరొందిన యుజ్వేంద్ర చాహల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్) లో అత్యుత్తమమైన, ఎన్నదిగన కెప్టెన్లలో సంజూ శాంసన్ ఒకడు అని కితాబు ఇచ్చాడు. ఒక రకంగా భారత జట్టుకు ఎనలేని విజయాలు అందించిన చెన్నై సూపర్ కింగ్స్ స్కిప్పర్ ఝార్ఖండ్ డైనమెట్ మహేంద్ర సింగ్ ధోనీ తో పోల్చాడు. ప్రస్తుతం యుజ్వేంద్ర చాహల్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
మిస్టర్ కూల్ కెప్టెన్ గా పేరు తెచ్చుకున్నాడు సంజూ శాంసన్. మైదానంలో కానీ బయట కానీ చాలా ప్రశాంతంగా కనిపించే సంజూ గురించి ఎంత చెప్పినా తక్కువేనన్నాడు యుజ్వేంద్ర చాహల్. ఇదిలా ఉండగా స్టీవ్ స్మిత్ ను తప్పించాక రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం అనూహ్యంగా సంజూ శాంసన్ కు సారథ్య బాధ్యతలు అప్పగించింది. గత ఏడాది ఐపీఎల్ సీజన్ లో అనూహ్యంగా తన జట్టును ఫైనల్ కు చేర్చాడు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో టాప్ 4లో కొనసాగుతోంది.
హ్యూమన్ బాంబే ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యుజ్వేంద్ర చాహల్ తన అభిప్రాయాలను పంచుకున్నాడు. గతంలో ఐపీఎల్ లో ఆర్సీబీ తరపున ఆడాడు. కానీ తన ఫస్ట్ బెస్ట్ ఛాయిస్ మాత్రం సంజూ శాంసన్ అని స్పష్టం చేశాడు. శాంసన్ కూడా ధోనీ లాంటోడని పేర్కొన్నాడు ఈ స్పిన్నర్. చాహల్ ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో ఆడాడు. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్నాడు. సంజూ శాంసన్ తనకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చాడని కొనియాడాడు.
