Satya Pal Malik : మోదీ సర్కార్ పై మాలిక్ కన్నెర్ర
రాహుల్ గాంధీతో మాజీ గవర్నర్ భేటీ
Satya Pal Malik : న్యూఢిల్లీ – కేంద్రంలో కొలువు తీరిన మోదీ , బీజేపీ సంకీర్ణ సర్కార్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు జమ్మూ , కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్(Satya Pal Malik). ఏఐసీసీ మాజీ చీఫ్, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ ప్రత్యేకంగా సత్య పాల్ మాలిక్ తో భేటీ అయ్యారు. ఇద్దరూ దేశానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. పుల్వామా ఉగ్రదాడి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ దాడికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఆవేదన వ్యక్తం చేశారు.
Satya Pal Malik Slams Modi
జమ్మూ కాశ్మీర్ లో ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, తిరిగి రాష్ట్ర హోదాను ఇవ్వాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ వైఫల్యం కారణంగా పుల్వామా ఉగ్ర దాడికి దారి తీసిందని స్పష్టం చేశారు. ఇందులో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు సత్య పాల్ మాలిక్.
తన పదవీ కాలంలో ఆర్టికల్ 370ని రద్దు చేసి రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా విభజించడాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. బలవంతంగా సాయుధ దళాల ద్వారా జమ్మూ, కాశ్మీర్‌ను ఉంచలేరని కుండ బద్దలు కొట్టారు. ప్రజల విశ్వాసాన్ని గెలుచు కోవడం ద్వారా ఏదైనా చేయగలమని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా జమ్మూ కాశ్మీర్ సాధారణ స్థితికి చేరుకోవాలంటే తిరిగి హోదా ఇవ్వడం తప్ప మరో మార్గం లేదన్నారు సత్య పాల్ మాలిక్.
Also Read : Nara Bhuvaneshwari : బాధిత కుటుంబాలకు టీడీపీ భరోసా