Shakuntalam Movie : శాకుంతలం విడుద‌ల వాయిదా

ద‌ర్శ‌కుడు గుణ శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌ముఖ న‌టి స‌మంత న‌టించిన శాకుంత‌లం చిత్రం విడుద‌ల వాయిదా ప‌డింది. ఫిబ్ర‌వ‌రి 17న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తామ‌ని గ‌తంలో ప్ర‌క‌టించారు. అంత‌కు ముందు కూడా ఒక‌సారి పోస్ట్ పోన్ చేశారు. చివ‌ర‌కు స‌మంత ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూశారు ఈ చిత్రం కోసం. చావు క‌బురు చ‌ల్ల‌గా చెప్పారు మ‌రోసారి వాయిదా ప‌డింద‌ని. ట్విట్ట‌ర్ వేదిక‌గా అధికారికంగా చిత్ర యూనిట్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. అనివార్య కార‌ణాల వ‌ల్ల శాకుంత‌లం మూవీని వాయిదా వేస్తున్న‌ట్లు వెల్ల‌డించింది.