Sunitha Laxma Reddy : సునీతా లక్ష్మారెడ్డికి కేసీఆర్ ఛాన్స్

బీ ఫామ్ అంద‌జేసిన సీఎం కేసీఆర్

Sunitha Laxma Reddy : హైద‌రాబాద్ – న‌ర్సాపూర్ ఎమ్మెల్యేకు ఊహించ‌ని షాక్ త‌గిలింది. పార్టీ ఎమ్మెల్యేను కాద‌ని బీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థిగా సునీతా ల‌క్ష్మా రెడ్డిని ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం ఎమ్మెల్యేగా మ‌ద‌న్ రెడ్డి కొన‌సాగుతున్నారు. ఆయ‌న‌ను కాద‌ని ఆమెకు అప్ప‌గించారు.

Sunitha Laxma Reddy Got a Chance

మ‌ద‌న్ రెడ్డికి ఖుష్ క‌బ‌ర్ చెప్పారు బీఆర్ఎస్ బాస్. రాబోయే పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో మెద‌క్ ఎంపీగా ఛాన్స్ ఇస్తాన‌ని స్ప‌ష్టం చేశారు. అప్ప‌టి వ‌ర‌కు ఈసారి టికెట్ ఇచ్చిన సునీతా ల‌క్ష్మా రెడ్డికి(Sunitha Laxma Reddy) మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని, ఆమెను భారీ మెజారిటీతో గెలిపించాల‌ని మ‌ద‌న్ రెడ్డిని ఆదేశించారు.

పార్టీలో అంతర్గత సర్దుబాటు చేస్తూ, అధినేత సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో భేటీ అయిన బీఆర్ఎస్ పార్టీ కోర్ కమిటీ సభ్యులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఏకగ్రీవంగా బీఆర్ఎస్ పార్టీ కీలక సభ్యులు తీసుకున్న నిర్ణయం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ మదన్ రెడ్డి నాతో పార్టీలో మొదటి నుంచి కొనసాగుతున్న సీనియర్ నాయకుడు. 35 ఏండ్ల నుంచి నాతో సన్నిహితంగా కొనసాగుతున్న నేతగా నాకు అత్యంత ఆప్తుడు. నాకు కుడి భుజం లాంటి వాడు, సోదర సమానుడు.

పార్టీ ఆలోచనలను గౌరవించి నర్సాపూర్ ఎన్నికలను తన భుజ స్కందాలమీద వేసుకుని సునీతా లక్ష్మారెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించే బాధ్యత తీసుకున్నందుకు సంతోషంగా వుందన్నారు. ప్రస్థుతం కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీ గా కొనసాగుతున్న పార్లమెంటరీ స్థానం నుండి మదన్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది.

Also Read : Komatireddy Raja Gopal Reddy : బీజేపీకి కోమటిరెడ్డి రిజైన్

Leave A Reply

Your Email Id will not be published!