DK Aruna: అడ్డగోలుగా టెండర్లు కట్టబెట్టి ప్రాజెక్టులు కేటాయిస్తున్నారన్నారు : ఎంపీ డీకే అరుణ

అడ్డగోలుగా టెండర్లు కట్టబెట్టి ప్రాజెక్టులు కేటాయిస్తున్నారన్నారు : ఎంపీ డీకే అరుణ

కాంగ్రెస్ అధిష్ఠానానికి ఆర్ధిక లావాదేవీలు జరుపుకోవడం కోసమే ఈ హైడ్రా లక్ష్యమని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ తీవ్ర ఆరోపణలు గుప్పిచారు. ఈ క్రమం లో ప్రజల దృష్టి మరల్చడానికే రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను తెరపైకి తెచ్చిందని విమర్శించారు. స్థానికులను ఒక్కసారిగా నిరాశ్రయులను చేయడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు. హైడ్రా పేరుతో ప్రభుత్వం ప్రజలను బెంబేలెత్తిస్తోందని, హైదరాబాద్ అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌కు రావాలంటే పెట్టుబడిదారులు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.

మాజీ సీఎం కేసీఆర్‌కు మించిన అవినీతిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసే దోపిడీని ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. అడ్డగోలుగా టెండర్లు కట్టబెట్టి ప్రాజెక్టులు కేటాయిస్తున్నారన్నారు. వక్ఫ్ చట్టం 2024 సవరణ బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పర్యటించిందని.. అందులో భాగంగా శనివారం హైదరాబాద్‌కు రానున్నట్లు చెప్పారు.

Leave A Reply

Your Email Id will not be published!