Tunisha Sharma Suicide : న‌టి తునీషా శ‌ర్మ ఆత్మ‌హ‌త్య‌

ప్ర‌ముఖ న‌టి తునీషా శ‌ర్మ ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు. ఆమెకు 20 ఏళ్లు. సినిమా సెట్ లో చ‌ని పోయిన‌ట్లు క‌నుగొన్నారు పోలీసులు. ఇదిలా ఉండ‌గా త‌న కూతురు సూసైడ్ చేసుకునేంత పిరికిది కాద‌ని త‌ల్లి ఆరోపించింది. త‌న కూతురును స‌హ న‌టుడు షీజాన్ మ‌హమ్మ‌ద్ ఖాన్ ప్ర‌మేయం ఉందంటూ ఆరోపించింది.

ఈ మేర‌కు తునీషా శ‌ర్మ త‌ల్లి పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో బాలీవుడ్ లో క‌ల‌క‌లం రేగింది. ఆమె ఉరి వేసుకుని క‌నిపించ‌డం ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది. ఇదిలా ఉండ‌గా తునీషా శ‌ర్మ అలీ బాబా ద‌స్తాన్ ఇ కాబూల్ షోలో ప్ర‌ధాన పాత్ర పోషించారు. ఈ పాత్ర ద్వారా ఆమెకు ఎంత‌గానో పేరొచ్చింది.