Bharti Pravin Pawar : ఏపీ సర్కార్ పై కేంద్ర మంత్రి ఫైర్
నిధులు మేమిస్తే జగన్ ప్రచారం
Bharti Pravin Pawar : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు కేంద్ర మంత్రి భారతి ప్రవీణ్ పవార్(Parvin Pawar) . బుధవారం నరేంద్ర మోదీ తొమ్మిదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ది, సంక్షేమ పథకాలకు సంబంధించిన పుస్తకాలను ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులకు కనీస ప్రోటోకాల్ పాటించడం లేదని ఆరోపించారు. మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.
కేంద్రం నిధులను మంజూరు చేస్తే ఏపీ సర్కార్ దీని గురించి ప్రస్తావించడం లేదని మండిపడ్డారు. విచిత్రం ఏమిటంటే ప్రోటోకాల్ పాటించడం లేదని పేర్కొన్నారు. భారత దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా వ్యవహరించడం లేదని ఆరోపించారు భారతి ప్రవీణ్ పవార్(Parvin Pawar).
కేంద్రం ఫెడరల్ స్పూర్తి పాటిస్తుంటే ఏపీ సర్కార్ ఆ స్పూర్తిని ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. తాము ఏం చేస్తున్నామో చెప్పడం ద్వారా ఎన్నికలకు సిద్దం అవుతు్న్నామని చెప్పారు. ఒడిస్సా రైలు దుర్ఘటన బాధాకరమని అన్నారు. ఇప్పటికే సీబీఐ కేసు నమోదు చేసిందని, విచారణకు ఆదేశించడం జరిగిందని, రిపోర్టు వచ్చాక అన్ని విషయాలు బహిర్గతం అవుతాయని స్పష్టం చేశారు భారతి ప్రవీణ్ పవార్.
సబ్ కా సాత్ సబ్ కా వికాస్ పేరుతో అందరికీ ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని తెలిపారు కేంద్ర మంత్రి. 80 కోట్ల మందికి మోడీ సంక్షేమ ఫలాలు అందాయన్నారు. గరీబ్ కళ్యాణ్ యోజన కింద పేదలకు ఉచితంగా బియ్యం ఇచ్చామన్నారు. 3 లక్షలు ఇచ్చి పేదల సొంతింటి కల నెరవేర్చడం జరిగిందని చెప్పారు.
Also Read : CM Siddaramaiah : ఉచిత విద్యుత్ అమలు చేస్తాం – సీఎం