PM Modi : ట‌ర్కీకి స‌హాయం చేస్తాం – న‌రేంద్ర మోదీ

ట‌ర్కీలో జ‌రిగిన భూకంపంలో భారీ ఎత్తున ప్రాణ‌, ఆస్తి న‌ష్టం చోటు చేసుకుంది. ప్ర‌స్తుతానికి 100 మందికి పైగానే మృతి చెందిన‌ట్లు ప్రాథ‌మిక స‌మాచారం. కానీ మృతుల‌, బాధితుల సంఖ్య మ‌రింత పెర‌గ‌నుంద‌ని అంచ‌నా. ఇదిలా ఉండ‌గా ఫిబ్ర‌వ‌రి 6 సోమారం చోటు చేసుకున్న భూకంప న‌ష్టంపై తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు భార‌త దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ.

ఈ సంద‌ర్భంగా మృతుల కుటుంబాల‌కు త‌న ప్ర‌గాఢ సానుభూతిని తెలిపారు. ట‌ర్కీకి అవ‌స‌ర‌మైన స‌హాయం చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. స‌హాయ‌క కార్య‌క్ర‌మాల‌లో భార‌త దేశానికి చెందిన ప్ర‌తినిధులు పాల్గొంటార‌ని స్ప‌ష్టం చేశారు ప్ర‌ధాన‌మంత్రి. ఎలాంటి సాయం కావాల‌న్నా అందించేందుకు సిద్దంగా ఉన్నామ‌ని భ‌రోసా ఇచ్చారు.