Womens T20 World Cup England : ఊపు మీదున్న ఇంగ్లాండ్

దక్షిణాఫ్రికా వేదిక‌గా ఐసీసీ మ‌హిళ‌ల టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో మోస్ట్ ఫేవ‌ర‌బుల్ జ‌ట్ల‌లో ఒక‌టిగా పేరు పొందింది ఇంగ్లండ్ జ‌ట్టు. ఇప్ప‌టికే ఫుల్ ప్రాక్టీస్ లో నిమ‌గ్న‌మైన ఈ టీమ్ ఎలాగైనా స‌రే వ‌ర‌ల్డ్ క‌ప్ ను స్వంతం చేసుకోవాల‌ని ఉవ్విళ్లూరుతోంది. అంతే కాదు ఆ మేర‌కు వ్యూహాలు కూడా ప‌న్నుతోంది. క్రికెట్ ఆట‌కు పుట్టినిల్లు అయిన ఇంగ్లాండ్ లో ప్ర‌తి ఒక్క‌రు క్రికెట్ ను ఇష్ట ప‌డ‌కుండా ఉండ‌లేరు. ఎందుకంటే ఇది జెంటిల్మెన్ గేమ్ అని కూడా పిలుచుకుంటారు.

ఇది ప‌క్క‌న పెడితే ప్ర‌తిష్టాత్మక‌మైన టోర్నీలో దుమ్ము రేపాల‌ని రెడీ అయ్యింది ఇంగ్లండ్ . అన్ని ఫార్మాట్ ల‌లో స‌త్తా చాటుతూ వ‌స్తున్న ఈ జ‌ట్టు ఇప్పుడు ఏ జ‌ట్టునైనా ఎదుర్కొనే స‌త్తా క‌లిగి ఉంది. ఆ మేర‌కు త‌మ జ‌ట్టును అలా ఫామ్ చేసుకున్నారు. ఇందుకు ఈసీబీని అభినందించాలి.