ఐటీ సెక్టార్‌లో ఐకాన్ హైద‌రాబాద్

ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ రోజు రోజుకు విస్త‌రిస్తోంది. ప్ర‌పంచాన్ని ఒంటి చేత్తో శాసిస్తోంది. కోట్లాది మందికి జీవ‌నోపాధి ద‌క్కిలే చేస్తోంది. మారుతున్నటెక్నాల‌జీకి అనుగుణంగా ఆయా కంపెనీలు సైతం త‌మ ప‌నితీరును ఎప్ప‌టిక‌ప్పుడు అప్ డేట్ చేసుకుంటున్నాయి. ఆ దిశ‌గా ఐటీని ప‌రుగులు పెట్టిస్తున్నాయి. ఇదే క్ర‌మంలో మేకిన్ ఇండియా ..స్టాండ‌ప్ ఇండియా పేరుతో మోదీ ప్ర‌భుత్వంలోని మోదీ ప్ర‌భుత్వం ఐటీకి అగ్ర తాంబూలం ఇచ్చింది. జాతి, కుల‌, మ‌త‌, వ‌ర్గాలు అనే తేడా లేకుండా ఆలోచ‌న‌ల‌కు రెక్క‌లు తొడిగి..క‌ల‌ల్ని సాకారం చేసుకునే అద్భుత‌మైన అవ‌కాశాల‌కు తెర తీసింది. దేశంలోని ప‌లు రాష్ట్రాల‌కు స్టార్ట‌ప్ ఫండ్ ను అంద‌జేస్తోంది. ఇదే క్ర‌మంలో బెంగ‌ళూరు, హైద‌రాబాద్, త‌మిళ‌నాడు, త‌దిత‌ర ప్రాంతాల‌న్నీ ఐటీ హ‌బ్ లుగా విరాజిల్లుతున్నాయి.
ఐటీ సెక్టార్ ను ఒంటి చేత్తో శాసిస్తున్న టెక్ దిగ్గ‌జాలైన గూగుల్, మైక్రో సాఫ్ట్, పొలారిస్, ఒరాకిల్, యాహూ, ట్విట్ట‌ర్, ఫేస్ బుక్, ఇన్ఫోసిస్, విప్రో, ఆపిల్, త‌దిత‌ర కంపెనీల‌న్నీ మ‌న భాగ్య‌న‌గ‌రం వైపు చూస్తున్నాయి. ఏకంగా అమెరికా త‌ర్వాత గూగుల్, ఫేస్ బుక్ త‌మ కార్యాల‌యాల‌ను ఇక్క‌డే ఏర్పాటు చేశాయి. ఇక ఇండియాలో కొత్త‌గా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం ప్ర‌త్యేకించి ఐటీ, ఇండ‌స్ట్రీస్, త‌దిత‌ర రంగాల‌కు సంబంధించి భారీ విజ‌న్ ను క‌లిగి ఉన్న‌ది. దీనికి ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖా మంత్రిగా యువ నాయ‌కుడు మంత్రి కేటీఆర్ ఉండ‌డం, ఆయ‌న‌కు అన్ని విధాలుగా అన్ని రంగాల‌లో అనుభ‌వం క‌లిగిన ఉన్న‌తాధికారిగా జ‌యేశ్ రంజ‌న్ ప‌ని చేస్తుండ‌డంతో ప‌లు కంపెనీలు పెట్టుబ‌డులు పెట్టేందుకు ముందుకు వ‌స్తున్నాయి.
ఐటీ రంగం ఒక్క‌టే కాదు లాజిస్టిక్, ఈ కామ‌ర్స్, హెల్త్ , టెలికాం, వినోదం, మీడియా, త‌దిత‌ర రంగాల‌కు చెందిన బ‌డా కంపెనీల‌న్నీ హైద‌రాబాద్ బాట ప‌ట్టాయి. ఈ క్రెడిట్ వీరిద్ద‌రికే ద‌క్కుతుంది. దేశ ఆర్థిక రంగాన్ని ..పారిశ్రామిక రంగాన్ని శాసిస్తున్న టాటా, రిల‌య‌న్స్, త‌దిత‌ర కంపెనీలు సైతం మ‌న సిటీని ఎంచుకుంటున్నాయి. ఇక్క‌డ ఇంక్యూబ్ సెంట‌ర్‌ల‌ను ఏర్పాటు చేశారు. ఔత్సాహికులైన యువ‌తీ యువ‌కుల‌కు..క్రియేటివిటీ క‌లిగిన వారికి తెలంగాణ ప్ర‌భుత్వం స‌పోర్ట్ చేసింది. ఐటీ శాఖ భారీ ఎత్తున నిధులు మంజూరు చేసింది. అంతే కాదు ఆయా రంగాల‌లో ల‌బ్ద‌ప్ర‌తిష్టులైన ..విజ‌యాలు సాధించిన వ్యాపార‌వేత్త‌లు, పారిశ్రామిక‌వేత్త‌ల‌తో ఓ టీంను ఏర్పాటు చేసింది.
వీరి ఆలోచ‌న‌లు, అనుభ‌వాల‌ను వేదిక మీద పంచేలా..రేప‌టి భ‌విష్య‌త్ ను మ‌రింత సుల‌భ‌త‌రం చేసేలా..వేలాది మందికి ఉపాధి క‌ల్పించేలా చేసేందుకు ఐటీ శాఖ శాయ‌శ‌క్తులా కృషి చేస్తోంది. ఐటీ హ‌బ్ లో టీ హ‌బ్ ను ఏర్పాటు చేయ‌డం. స్టార్ట‌ప్ లు స్టార్ట్ చేసేందుకు ముందుకు వ‌చ్చే వారికి డిజిట‌ల్, ఐటీ టెక్నాల‌జీని అందించ‌డం. వీలైతే మెంటార్, ఫండింగ్ స‌పోర్ట్ చేస్తోంది. ఏంజిల్ సంస్థ‌లు, ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ బ్యాంకులలో స్టార్ట‌ప్ ఫండింగ్ ఇచ్చేలా చూస్తోంది. ఐటీ శాఖ స‌పోర్ట్ తో స‌క్సెస్ అయిన సంస్థ‌లు, వ్య‌క్తులతో పాటు స‌క్సెస్‌ఫుల్ ప‌ర్స‌నాలిటీల‌తో క‌లిపేలా ఎప్ప‌టిక‌ప్పుడు వారి విజ‌య గాధల‌ను డిజిట‌ల్, సోష‌ల్ మీడియా వేదిక‌గా చేర‌వేస్తోంది.
ఐటీ సెక్టార్ లో హైద‌రాబాద్ స్టోరీస్ ఇపుడు ఓ ఐకాన్ గా నిలుస్తోంది. హైద‌రాబాద్ కు పేరు తీసుకు వ‌చ్చిన వారే ఇందులో భాగ‌స్వాములుగా ఉన్నారు. రాజులు రాలి పోయారు. రాజ్యాలు కూలి పోయాయి. దేశాల మధ్య అంత‌రాలు చెదిరి పోయాయి. సంస్కృతులు, సాంప్ర‌దాయాలు మారి పోయాయి. కానీ ప్ర‌పంచాన్ని విస్మ‌య ప‌రిచేలా..స్ఫూర్తి దాయ‌కంగా నిలిచేలా బ‌తుకును..స‌మాజాన్ని..లోకాన్ని ప్ర‌భావితం చేసే గెలుపు గాధ‌లు నిలిచే ఉన్నాయి. ఇది చారిత్రిక స‌త్యం. దీనినే ప్రామాణికంగా తీసుకుని హైద‌రాబాద్ స్టోరీస్ త‌న వంతు కృషి చేస్తోంది. సాంకేతిక నిపుణులు, అనుభ‌వ‌జ్ఞులు, టెక్ గురులు, నాలెడ్జ్ ప‌ర్స‌న్లు, వ్యాపార‌, వాణిజ్య‌, పారిశ్రామిక వేత్త‌లు దీనిలో భాగం పంచుకుంటున్నారు.
సానుకూల దృక్ఫ‌థాన్ని కలిగించ‌డం. క‌ల‌లు వాస్త‌వం అయ్యేలా చూడ‌డం..వాటి గురించి ..దానికి ఆధార‌మైన హైద‌రాబాద్ ను ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేయడం దీని ఉద్ధేశం. మైక్రోసాప్ట్ సిఇఓ స‌త్య నాదెళ్ల‌, అపొలో లైఫ్ సిఇఓ ఉపాస‌న కామినేని, జివికె గ్రూప్ ఫౌండ‌ర్ జివికె రెడ్డి, గ్రీంకో గ్రూప్ సిఇఓ అనిల్ చ‌ల‌మాల శెట్టి, భార‌త్ బ‌యో టెక్ ఎండి క్రిష్ణ ఎల్ల‌, ఇన్ఫోరైస్ ఫౌండ‌ర్ క్రిష్ణ బోగాది, ఫీనిక్స్ గ్రూప్ ఇండియా ఫౌండ‌ర్ సురేష్ చుక్క‌ప‌ల్లి, ఎన్‌సిసి లిమిటెడ్ ఛైర్మ‌న్ ఎఎవి రంగ రాజు భాగం పంచుకుంటున్నారు. వీరితో పాటు అర‌విందో ఫార్మా కో ఫౌండ‌ర్ పి.వి. రాం ప్ర‌సాద్ రెడ్డి, కిమ్్స ఆస్ప‌త్రి వ్య‌వ‌స్థాకుడు భాస్క‌ర్ రావు, రామోజీ గ్రూప్ ఛైర్మ‌న్, ఫౌండ‌ర్ రామోజీ రావు, సియంట్ ఫౌండ‌ర్ బివిఆర్ మోహ‌న్ రెడ్డి, రాంకీ గ్రూప్ ఛైర్మ‌న్ అయోధ్య రామిరెడ్డి, కాల్ హెల్త్ ఫౌండ‌ర్ సంధ్య రాజు, డాక్ట‌ర్ రెడ్డీస్ ఎండీ క‌ల్లం స‌తీష్ రెడ్డి, టెర్ర‌స్ గ్రీన్ ఫౌండ‌ర్ లిఖిత భాను, హెరిటేజ్ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ ఎడిర్ నారా బ్రాహ్మ‌ణి, స‌న్ షైన్ హాస్పిట‌ల్స్ ఎండీ డాక్ట‌ర్ గురువా రెడ్డి, వాల్యూ లాబ్స్ సిఇఓ అర్జున్ రావు, ఎఆర్‌కె గ్రూప్ సిఇఓ మేఘ‌న గుమ్మి, సిటిఆర్ఎల్ఎస్ ఫౌండ‌ర్ శ్రీ‌ధ‌ర్ పున్న‌పు రెడ్డి, దివిస్ ఫార్మా ఎండీ డాక్ట‌ర్ ముర‌ళీకృష్ణ ఉన్నారు.
మ‌రో వైపు అభి బ‌స్ సిఇఓ సుధాక‌ర్ రెడ్డి, ఓమ్నీ హాస్పిట‌ల్స్ సిఇఓ డాక్ట‌ర్ అలోక్ ముల్లిక్, న‌వ‌యుగ గ్రూప్ ఛైర్మ‌న్ విశ్వేశ్వ‌ర్ రావు, రాధా టిఎంటి ఎండీ సుమ‌న్ స‌రాఫ్, సిగ్ని ఎనర్జీ చీఫ్ ఆప‌రేటింగ్ ఆఫీస‌ర్ ప‌రంజిత్ సింగ్, అర్బ‌న్ కిషాన్ సిఇఓ విహారి క‌న‌కొల్లు, ఇండియ‌న్ ఇమ్యూనాజిక‌ల్స్ లిమిటెడ్ ఎండీ ఆనంద్ కుమార్, రావే ఇనిస్టిట్యూట్స్ ఎండీ రోహిణి రాజు, ఏకం ఈఎల్‌సి ఫౌండ‌ర్ ముక్తా ఖురానా, ప్ర‌సాద్ స్టూడియోస్ ఎండీ ర‌మేష్ ప్ర‌సాద్, ఘ‌ర్ కార్పొరేష‌న్, ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ అభిన‌వ్ రామి రెడ్డి, దొడ్ల డెయిరీ ఫౌండ‌ర్ సునీల్ రెడ్డి, మెర్కిస్ ఫౌండ‌ర్ వైశాలీ, ఐకేవా ఫౌండ‌ర్ మోనికా మిశ్రా, డాక్ట‌ర్ సి వ్య‌వ‌స్థాప‌కురాలు మాన్సీ గాంధీ, మైట్రా ఎన‌ర్జీ లిమిటెడ్, ఎండీ విక్రం కైలాష్, డిజిగ్నీ టేల్స్ ఫౌండ‌ర్ ఎన్. మేఘ‌న‌, మ్యాప్ మై జెనోమీ సిఇఓ అను ఆచార్య‌, క్లీన్ సే హై, ఫౌండ‌ర్ సింధూర బొర్ర‌, శ్రీ‌ల్ టెక్నాల‌జీస్ ఫౌండ‌ర్ స్నేహ రాజ్, సాగ‌ర్ సిమెంట్స్ ఎండీ ఎస్. ఆనంద రెడ్డి, బికాయి కో ఫౌండ‌ర్ సోనాక్షి న‌థాని, కిటికి కో ఫౌండ‌ర్ రోహిణి దీప్తి, వుయ్ మేక్ స్కాల‌ర్స్ కో ఫౌండ‌ర్ దామిని మ‌హాజ‌న్ భాగం పంచుకుంటున్నారు.
వీరంద‌రిని ఒకే చోటుకు తీసుకు రావ‌డంలో ఐటీ కార్య‌ద‌ర్శి జ‌యేష్ రంజ‌న్ కృషి అభినంద‌నీయం. నూత‌న అంకురాల ఏర్పాటుతో స‌క్సెస్ సాధించిన వారు..వారి గెలుపు క‌థ‌ల‌న్నీ హైద‌రాబాద్ స్టోరీస్ లో ఇమిడి ఉన్నాయి. వీట‌ని సేక‌రించ‌డం, సోష‌ల్ మీడియాలో అనుసంధానం చేయ‌డంలో టెక్ గురూలు ఎంద‌రో ఉన్నారు. వీరిలో విపుల్ త‌లారీ కూడా ఒక‌రు. ఈ హైద‌రాబాద్ స్టోరీస్ లో మ‌న‌కు కావాల్సిన స్టోరీస్ లెక్క‌కు మించి ఉన్నాయి. కేట‌గిరీల వారీగా చూడొచ్చు. ముఖ్యంగా ఇందులో ఎయిరో స్పేస్, అగ్రిక‌ల్చ‌ర్, ఆర్ట్ అండ్ క‌ల్చ‌ర్, ఆటోమొబైల్, ఏవియేష‌న్, బిజినెస్, కోవిడ్ – 19, సైబ‌ర్ సెక్యూరిటీ, ర‌క్ష‌ణ రంగం, డెవ‌ల‌ప్ మెంట్, డిజిట‌ల్, ఎకాన‌మీ, ఎడ్యూకేష‌న్, ఎన‌ర్జీ, ఎంట‌ర్ టైన్ మెంట్, ప్ర‌త్యేకం, ఫ్యాష‌న్, ఫుండ్ అండ్ బేవ‌ర్జీస్, హైద‌రాబాద్ న‌గ‌ర పాల‌క సంస్థ‌, గ‌వ‌ర్న‌మెంట్, హెల్త్ కేర్, హెరిటేజ్, హాస్పిటాలిటీ, హైద‌రాబాద్, ఇండియా, ఐటీ, ఇన్‌ఫ్రా స్ట్ర‌క్చ‌ర్, మార్కెట్స్, న్యూస్, ఫార్మా, రియ‌ల్ ఎస్టేట్, రీసెర్్చ‌,సైన్స్, సోష‌ల్, స్పేస్, స్టార్ట‌ప్ స్టోరీస్, స్టార్ట‌ప్, టెక్, టూరిజం, ర‌వాణా, అప్ డేట్స్, ఇండియా, వేస్ట్ మేనేజ్‌మెంట్ విభాగాలున్నాయి. ఐటీ, డిజిట‌ల్ ప‌రంగా ఎంత వేగంగా హైద‌రాబాద్ దూసుకు పోతుందో హైద‌రాబాద్ స్టోరీస్ ను చూస్తే తెలుస్తుంది.

No comment allowed please