French Govt Crisis : 60 ఏళ్ల చరిత్రలో మొదటిసారి 3 నెలలకే పడిపోయిన అధికారం

ఇప్పుడు మిచెల్ బార్నియర్ తన రాజీనామాను అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు సమర్పించాల్సి ఉంటుంది...

French Govt : ఫ్రాన్స్ ప్రధాని మిచెల్ బార్నియర్ ప్రభుత్వం పడిపోయింది. మూడు నెలల క్రితమే ఆయన ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయడం విశేషం. గత 60 ఏళ్ల ఫ్రాన్స్(France) చరిత్రలో తొలిసారిగా పార్లమెంట్‌లో ప్రధానిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. దీంతో కన్జర్వేటివ్ నేత మిచెల్ ప్రభుత్వం అతి తక్కువ పదవీకాలం ఉన్న ప్రభుత్వంగా నిలిచిపోయింది. ఫ్రాన్స్‌(FranceFrance)లో మొత్తం 577 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నారు. మిచెల్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి 288 ఓట్లు అవసరం. కానీ 311 మంది ఎంపీలు మిచెల్‌కు వ్యతిరేకంగా ఓటు వేయడంతో అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయారు. ప్రభుత్వ పతనం కారణంగా ఫ్రాన్స్‌లో రాజకీయ అస్థిరత నెలకొంది.

French Govt Crisis..

ఇప్పుడు మిచెల్ బార్నియర్ తన రాజీనామాను అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు సమర్పించాల్సి ఉంటుంది. ఈ రాజీనామా ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు గట్టి దెబ్బగా భావిస్తున్నారు. అయితే రాజకీయ గందరగోళం మధ్య 2027 వరకు తన మిగిలిన పదవీకాలాన్ని పూర్తి చేస్తానని అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చెప్పారు. ఈ నేపథ్యంలో వారు త్వరలో కొత్త ప్రధానిని ప్రకటించనున్నారు. 73 ఏళ్ల మిచెల్ బార్నియర్ ప్రభుత్వం మైనారిటీలో ఉంది. ఈ ఏడాది జూలైలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఫ్రాన్స్‌లో ఏ పార్టీకి పార్లమెంట్‌లో మెజారిటీ రాలేదు. అధ్యక్షుడు మాక్రాన్ రెండు నెలల తర్వాత సెప్టెంబర్‌లో మిచెల్ బార్నియర్ నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. బార్నియర్ సంకీర్ణంలో ప్రభుత్వాన్ని నడపడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ విజయవంతం కాలేదు.

బార్నియర్‌పైఅవిశ్వాస తీర్మానానికి ప్రధాన కారణం ఇటీవల సమర్పించిన సామాజిక భద్రతా బడ్జెట్. బడ్జెట్‌లో ప్రత్యర్థులకు నచ్చని పన్నులు పెంచి ఖర్చులు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీన్ని వామపక్ష, రైటిస్ట్ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఫ్రాన్స్‌లో ప్రధానంగా 3 పార్టీలు ఉన్నాయి. అధ్యక్షుడు మాక్రాన్ సెంట్రిస్ట్ అలయన్స్, లెఫ్టిస్ట్ కూటమి న్యూ పాపులర్ ఫ్రంట్, రైటిస్ట్ పార్టీ నేషనల్ ర్యాలీ. ఆ క్రమంలో పార్లమెంట్‌లో ఓటింగ్ లేకుండానే బడ్జెట్‌ను ఆమోదించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడతామని విపక్షాలు ప్రకటించి తిరుగుబాటు చేశాయి. ఇది తెలుసుకున్న పలువురు బడ్జెట్ విషయంలో ప్రభుత్వాలు కుప్పకూలడం చాలా అరుదు అని చెబుతున్నారు.అవినీతి, స్కాంలు, సరిగా పనిచేయని కారణంగా గతంలో పలువురి నేతల ప్రభుత్వాలు కూలిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. ఇలాంటి వాటికి పాకిస్తాన్, బంగ్లాదేశ్ ప్రధానుల తొలగింపులు కూడా ఉదాహరణగా చెబుతున్నారు.

Also Read : Rahul Gandhi : సంభాల్ పర్యటనను అడ్డుకోవడంపై లోక్ సభలో నిలదీసిన రాహుల్ గాంధీ

Leave A Reply

Your Email Id will not be published!